Begin typing your search above and press return to search.

`చైతన్య గారి రిలాక్సింగ్ యోగా పిక్` షేకింగే

By:  Tupaki Desk   |   24 Dec 2020 10:00 AM IST
`చైతన్య గారి రిలాక్సింగ్ యోగా పిక్` షేకింగే
X
అక్కినేని కాంపౌండ్ లో స్టార్లంతా ఫిట్నెస్ ఫ్రీక్స్ అన్న సంగ‌తి తెలిసిందే. కింగ్ నాగార్జున .. నాగ‌చైత‌న్య‌.. స‌మంత‌.. అఖిల్ వీరంతా రెగ్యుల‌ర్ గా జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తూ యోగా ధ్యానం అంటూ ప‌ర్ఫెక్ట్ మెయింటెనెన్స్ తో అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అభిమానుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ఇక అక్కినేని కోడ‌లు స‌మంత త‌న హ‌బ్బీ నాగ‌చైత‌న్య‌తో క‌లిసి యోగా జిమ్ చేస్తూ ఉండే ఫోటోల్ని నిరంత‌రం షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా నాగ‌చైత‌న్య రేర్ యోగా ఫీట్ కి సంబంధించిన ఫోటోల‌ను స‌మంత ఇన్ స్టాలో షేర్ చేశారు.

ఒక అభిమాని ఆమెను ‘చైతన్య గారి రిలాక్సింగ్ యోగా పిక్’ పోస్ట్ చేయమని అడిగినప్పుడు సామ్ ఈ ఫోటోని షేర్ చేశారు. మొత్తం ఏడు చిన్న చిన్న చెక్క ముక్క‌ల‌పై ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో చూశారుగా.. చేతులు కాళ్లు త‌ల వెన్ను పామును ప‌ర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ ఇలా వెల్ల‌కిలా ప‌డుకుని యోగ ముద్ర‌లో ఉన్నాడు. అతని పాదాలు.. వీపు చేతులు తల మాత్రమే చెక్కపై ఉంచాడు.

చై నిజంగా ధ్యాన ముద్ర‌లో ప్రావీణ్యం సంపాదించాడని ఈ ఫోటో చెబుతోంది. సమంత మరికొన్ని ఆహ్లాదకరమైన చిరస్మరణీయ ఫోటోల‌ను కూడా పోస్ట్ చేసారు. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ వైర‌ల్ గా మారాయి. నాగ‌చైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరి రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా.. స‌మంత న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఆహాలో సామ్ జామ్ కార్య‌క్ర‌మం గురించి తెలిసిన‌దే.