Begin typing your search above and press return to search.

మీ సంతోషానికి వారి అభిప్రాయం అవసరం లేదు : సమంత

By:  Tupaki Desk   |   1 Jan 2022 12:01 PM IST
మీ సంతోషానికి వారి అభిప్రాయం అవసరం లేదు : సమంత
X
ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో సమంత ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమె ఫొటోలు.. వీడియోలు.. ఆమె పాటలు.. ఐటెం సాంగ్‌.. వ్యాఖ్యలు ఇలా ఏదో ఒక విషయం తో ట్రెండ్డింగ్‌ లో ఉంటుంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ అయినట్లుగా అందరు అనుకుంటున్నారు.. నిజంగానే ఆమె మునుపటి తో పోల్చితే ఎక్కువగా ఫొటోలు మరియు ఇతర విషయాలను షేర్‌ చేస్తుంది. ఫొటోలు షేర్‌ చేస్తే పెద్దగా చర్చ ఉండేది కాదు. కాని అప్పుడప్పుడు ఈమె చేస్తున్న పోస్ట్‌ లు కొందరిలో ఆలోచన కలిగిస్తున్నాయి. ఆమె షేర్‌ చేస్తున్న సూక్తులు.. ఇతర విషయాలు అన్ని కూడా సమంత అభిమానులతో పాటు ఇతర వర్గాల వారిని కూడా ఆకర్షిస్తున్నాయి.

జీవిత పాఠాలను చెబుతూనే.. ఎదుటి వారి నుండి ఏ విషయాలను తీసుకోవాలి.. వేటిని వదిలేయాలి అనే పోస్ట్‌ లను ఈమద్య ఎక్కువగా ఈమె షేర్‌ చేస్తూ వస్తుంది. తాజాగా మరోసారి సమంత ఒక ఆసక్తికర పోస్ట్‌ ను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇతరులు ఏమనుకుంటున్నారు.. ఇతరుల ఆలోచన ఏంటీ.. ఇతరుల యొక్క నిర్ణయాలు ఏంటీ అనేవి జైలు ఊచలాంటివి. వాటి నుండి విముక్తి పొందాలంటే వాటి గురించి ఆలోచించడం మానేయాలంటూ సమంత సూచించింది.

ఇతరుల అభిప్రాయంతో సంబంధం లేకుండా మీ సంతోషం కోసం మీ నిర్ణయాలను తీసుకోవాలి అన్నట్లుగా సమంత సూచించింది. ప్రతి ఒక్కరు కూడా ఇతరుల గురించి ఆలోచించడం ద్వారా సంతోషం అనేది కోల్పోతున్నారు అన్నట్లుగా సామ్‌ చెప్పుకొచ్చింది. సామ్ ఏ ఉద్దేశ్యంతో చెప్పిందో కాని కొందరు మాత్రం అక్షర సత్యం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే బ్యాడ్‌ కామెంట్స్ చేస్తూ ఆమెను కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు.

సమంత ఇటీవల చేసిన పుష్ప ఐటెం సాంగ్ సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ఆమె నుండి మరిన్ని ఐటెం సాంగ్స్ వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఆమె హీరోయిన్‌ గా రెండు సినిమాల్లో నటిస్తుంది. శాకుంతలం సినిమా ఇప్పటికే పూర్తి అవ్వగా తమిళంలో నయనతార తో కలిసి నటించిన సినిమా కూడా పూర్తి అయ్యింది. ఇక బాలీవుడ్‌ లో కూడా తాప్సి బ్యానర్‌ లో సమంత నటించేందుకు సిద్దం అయ్యింది. అది మాత్రమే కాకుండా హిందీలో మరిన్ని ప్రాజెక్ట్ లను సమంత చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సమంత ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తుంది. ఒక వైపు లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తూనే మరో వైపు కెరీర్‌ లో బిజీ అవుతోంది. సమంత తెలుగు లో మరిన్ని సినిమా లు చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.