Begin typing your search above and press return to search.

సమంతకు మహేష్ కూతురు పెట్టిన కండిషన్

By:  Tupaki Desk   |   16 March 2016 7:51 AM GMT
సమంతకు మహేష్ కూతురు పెట్టిన కండిషన్
X
స్టార్ హీరోయిన్ సమంతకు అర్జెంటుగా ఓ కూతురు కావాలటండీ. అది కూడా మూడే మూడు రోజుల్లో ఓ పాప కావాలంటోంది. తన కొత్త ఫ్రెండును ఇంప్రెస్ చేయాలంటే శనివారం లోపు ఓ పాపను అరేంజ్ చేసుకోవాల్సిందే అంటోంది సామ్. సమంతకు ఈ కొత్త ఆలోచన ఎందుకొచ్చింది.. ఇంతకీ ఏంటి మేటర్ అంటారా? ఆ సంగతేంటో చూద్దాం పదండి.

ప్రస్తుతం సమంత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘బ్రహ్మోత్సవం’ షూటింగులో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో లాంగ్ షెడ్యూల్ ముగించుకుని కొన్ని రోజుల కిందట హైదరాబాద్ వచ్చేసింది ‘బ్రహ్మోత్సవం’ యూనిట్. ఇక్కడ తర్వాతి షెడ్యూల్ షూటింగులో ఉండగా ‘బ్రహ్మోత్సవం’ సెట్ కి ఓ ముఖ్యమైన అతిథి వచ్చింది. ఆ గెస్ట్ మరెవరో కాదు.. మహేష్ ముద్దుల కూతురు సితార.

బ్రహ్మోత్సవం సెట్లో సమంత - సితార కలిసి నిన్నంతా ఆడుకున్నారు. ఇద్దరూ కలిసి ఫొటోలు కూడా దిగారు. ఐతే ఆ తర్వాత సమంతకు టాటా చెబుతూ.. సితార ఓ కండిషన్ పెట్టిందట. మనిద్దరం శనివారం కూడా ఆడుకుందాం.. ఐతే ఆ రోజు నాతో కలిసి ఆడుకోవడానికి.. నీ పాపను కూడా తీసుకురా అని కండిషన్ పెట్టిందట సితార. మరి శనివారానికల్లా తనకో కూతురు కావాలని, ఎలాగోలా ఎరేంజ్ చేసుకోవాలని అంటూ సరదాగా ట్వీట్ చేసింది సామ్. మరి సితార వచ్చేసరికి సమంత ఓ పాపను ఎలా అరేంజ్ చేసుకుంటుందో చూడాలి.