Begin typing your search above and press return to search.
సమంత తల్లి కావాలని కోరుకుంది: 'శాకుంతలం' నిర్మాత
By: Tupaki Desk | 9 Oct 2021 12:00 PM ISTప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య - సమంత జంట విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ గా పిలవబడే చై-సామ్ తమ నాలుగేళ్ళ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు గత వారం అధికారికంగా ప్రకటించారు. దీనికి కారణాలు ఎంటనేది వారు వెల్లడించలేదు కానీ.. ఈ వ్యవహారం మీద అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సమంత పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. అందుకే చైతన్య విడాకులు ఇచ్చే వరకు వచ్చిందని పుకార్లు పుట్టుకొచ్చాయి
అయితే సామ్ ఈ వార్తలను సోషల్ మీడియా వేదికగా ఖండించింది. ''నాకు అఫైర్స్ ఉన్నాయని.. నేను పిల్లల్ని వద్దనుకున్నానని.. నేను అవకాశవాదిని అని.. ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకున్నానని అంటున్నారు. నాపై జరుగుతున్న ఈ దాడి ఏమాత్రం దయలేనిది. విడాకులు అనేది చాలా బాధతో కూడిన ప్రక్రియ. దాన్నుంచి కోలుకొని కొంత స్వాంతన పొందడానికి నన్ను ఒంటరిగా వదిలేయండి'' అని సమంత విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో చై-సామ్ విడాకుల వ్యవహారంపై మాట్లాడిన దర్శకుడు గుణశేఖర్ కుమార్తె, ‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ షాకింగ్ విషయాలను వెల్లడిచింది. సామ్ పిల్లల్ని కనడానికి సిద్దంగా ఉందని.. కానీ ఈ మధ్యలోనే ఏదో జరిగి విడిపోయారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
నీలిమ గుణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చై-సామ్ విడాకులపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 'శాకుంతలం' కోసం మా నాన్న సమంతను సంప్రదించే సమయానికే ఆమె సినిమాలు చేయకూడదని నిర్ణయించుకొని ఉన్నారు. అందుకే ఇప్పట్లో సినిమా చేయనని చెప్పింది. కానీ, కథ నచ్చడంతో త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనే కొన్ని కండిషన్స్ తో ఓకే చెప్పింది. ఆమె తల్లి కావాలని కోరుకుంది. అందుకే జూలై - ఆగస్ట్ సమయానికి షూటింగ్ పూర్తిచేయాలని సమంత కోరడంతో.. మేము దానికి తగ్గట్లుగానే ప్లాన్ చేసుకున్నాం. ప్రీ-ప్రొడక్షన్ శరవేగంగా పూర్తి చేసి బ్రేక్స్ లేకుండా షెడ్యూల్ లు కంప్లీట్ చేసినందుకు సామ్ సంతోషంగా ఉంది. ఈ మూవీ తర్వాత బ్రేక్ తీసుకొని పిల్లల్ని కనేందుకు సామ్ ప్లాన్ చేసుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చైతన్య-సమంత విడిపోవడం షాకింగ్ గా ఉంది అని నీలిమా గుణ చెప్పుకొచ్చింది.
కాగా, 'ఏమాయ చేసావే' సినిమాతో తొలిసారి ప్రేక్షకులను మాయ చేసిన నాగచైతన్య - సమంత జంట.. ఏడేళ్లు ప్రేమించుకొని 2017 అక్టోబర్ 7న పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ళ కాపురం తర్వాత ఇకపై భార్యా భర్తలుగా ఉండబోమని ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోయిన ఈ జంట వారు ఎంచుకున్న దారుల్లో ముందుకు పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.