Begin typing your search above and press return to search.

టాక్ ఆఫ్ ది టౌన్ .. స‌మంత బోల్డ్ ఆన్స‌ర్!

By:  Tupaki Desk   |   3 Dec 2021 12:00 PM IST
టాక్ ఆఫ్ ది టౌన్ .. స‌మంత బోల్డ్ ఆన్స‌ర్!
X
స‌మంత వ్య‌క్తిగ‌త విషయాల‌న్నింటిని ప‌క్క‌న‌బెట్టి మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత పాత్ర‌ల విషయంలో కొన్ని ప‌రిమితులు విధించుకున్నా.. ఇటీవ‌లి ప‌రిణామాల అనంత‌రం తిరిగి య‌థావిథిగా నిబంధ‌న‌లు స‌డ‌లించి ముందుకు సాగుతున్న‌ట్లు గుస‌గుస వినిపిస్తోంది.

ఇక స‌రిహ‌ద్దులు చెరిపేసి న‌ట‌న‌ను విస్త్ర‌తం చేయ‌నుంది. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోనూ జోరు పెంచింది. దీనిలో భాగంగా తాప్సీ సొంత నిర్మాణ సంస్థ‌లో ఓ సినిమాచే య‌డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో స‌మంత కాస్త బోల్డ్ గానే న‌టిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్రాజెక్ట్ వివ‌రాలు ఇంకా పూర్తిగా బ‌య‌ట‌కు రాలేదుగానీ సామ్ కెరీర్ లో ట‌ర్నింగ్ రోల్ చేస్తుంద‌నే టాక్ బాలీవుడ్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్ప‌టికే `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ లో త‌న బోల్డ్ యాంగిల్ ని ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఒక‌సారి కెరీర్ ప్రారంభ‌మైందంటే బాలీవుడ్ తెర‌పై ఇంకా చాలా అడ్వాన్స్ డ్ గా న‌టించాల్సి ఉంటుంది. ఇలా అన్ని ర‌కాలుగా సిద్ధ‌ప‌డి ముందుకు సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో స‌మంత పాత ఇంట‌ర్వ్యూలో ర్యాపిడ్ క్వ‌శ్చ‌న్స్ లో భాగంగా శృంగారం గురించి చేసిన కామెంట్లు మ‌రోసారి తెర‌పైకి తెస్తున్నారు నెటిజ‌నులు.

ఆహారం లేదా శృంగారం దేనికి మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తారంటే ఆహారం లేకుండా ఒక రోజు అంతా ఉండ‌గ‌ల‌ను అని చెప్పింది. అంటే అక్క‌డ శృంగారానికి ఆమె ఎంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్న‌ది హైలైట్ అవుతోంది.

ఐదేళ్ల కింద‌ట జ‌రిగిన వ్య‌వ‌హారం ఇప్పుడు తెర‌పైకి రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో `శాకుంత‌లం` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అలాగే మ‌రో రెండు తెలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది.