Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మూవీలో సమంత...?

By:  Tupaki Desk   |   21 Jun 2020 11:30 PM GMT
పాన్ ఇండియా మూవీలో సమంత...?
X
సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత తెలుగులో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు. గతేడాది 'సూపర్ డీలక్స్' 'ఓ బేబీ' 'మజిలీ' సినిమాల్లో నటించిన సమంత ఈ ఏడాది తమిళ రీమేక్ 'జాను' సినిమాతో పలకరించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టబోతోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కి కొనసాగింపుగా వస్తున్న సీజన్ 2 లో సమంత కీలక నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సిరీస్ లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు సమంత. ఇది ఈ ఏడాదే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది. అయితే తెలుగులో మాత్రం మరో సినిమా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం సామ్ కొత్త సినిమాకి ఓకే చెప్పిందట.

కాగా సమంత ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ వారితో ఓ సినిమాకి సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్‌ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్నారట. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా సమంత కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ కే పరిమితమైన సామ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోందట. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో ఇయర్ ఎండింగ్ కి కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇండస్ట్రీలో పరిస్థితులు చక్కబడిన తర్వాత దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.