Begin typing your search above and press return to search.

సమంత పాన్‌ ఇండియా మూవీ చేతులు మారింది

By:  Tupaki Desk   |   14 Oct 2020 10:45 AM IST
సమంత పాన్‌ ఇండియా మూవీ చేతులు మారింది
X
సమంత చాలా గ్యాప్‌ తర్వాత దర్శకుడు అశ్విన్‌ శరవనన్‌ దర్శకత్వంలో ఒక పాన్‌ ఇండియా సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యిందంటూ ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. నవంబర్‌ లేదా డిసెంబర్‌ నుండి ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అశ్విన్‌ చెప్పిన స్క్రిప్ట్‌ కు ఫిదా అయిన సమంత వెంటనే నటించేందుకు ఓకే చెప్పిందని తెలుగు తమిళంతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్‌ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సి ఉండగా ప్రాజెక్ట్‌ చేతులు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు అశ్విన్‌ శరవనన్‌ తప్పుకుని ఈ సినిమాకు సమంత స్నేహితురాలు అయిన నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లుగా తమిళ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ఓ బేబీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్‌ రావడంతో పాటు ఆ సమయంలోనే మరో సినిమాను కూడా వీరిద్దరు చేయాలని భావించారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.

అశ్విన్‌ సినిమాను నందిని రెడ్డి ఏ కారణం వల్ల టేకోవర్‌ చేసింది అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించేందుకు చాలా కంఫర్ట్‌ గా ఫీల్‌ అవుతుందట. ఈ విషయాన్ని గతంలో సమంత ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ కారణం వల్లే ఈ పాన్‌ ఇండియా మూవీని నందిని రెడ్డికి అప్పగించి ఉంటారని కొంతమంది అభిప్రాయం. అసలు విషయం ఏంటీ అనేది చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కాని తెలియదు.