Begin typing your search above and press return to search.

సమంతా హైలైట్ అయితే చాలా?

By:  Tupaki Desk   |   2 July 2019 11:29 AM GMT
సమంతా హైలైట్ అయితే చాలా?
X
ఇంకో నాలుగు రోజుల్లో సమంత టైటిల్ రోల్ పొషించిన ఓ బేబీ విడుదల కానుంది. అదే రోజు బుర్రకథ-రాజ్ దూత్ లు పోటీ ఉన్నప్పటికీ హైప్ లోనూ ప్రమోషన్ లోనూ బేబీదే పైచేయిగా ఉంది. అయితే అంతా రామమయం పాట తరహాలో ఓ బేబీ పబ్లిసిటీలో ఎక్కడ చూసినా సమంతనే హై లైట్ అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదలుకుని వీడియో సాంగ్ టీజర్స్ తో సహా ప్రతిచోటా తన బొమ్మతోనే ప్రచారం చేస్తున్నారు.

నిజానికి ఇందులో నాగ శౌర్య హీరో. కథ సామ్ పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలిసినా తన రోల్ డిజైన్ చేసిన విధానం నచ్చడంతో ఒకే చెప్పాడు. అందులోనూ దర్శకురాలు నందిని రెడ్డి తనకు కల్యాణ వైభోగమే హిట్ ఇచ్చిన అభిమానం అతనికి ఉంది. ఈ రెండు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు

కానీ ఓ బేబీకి జరుగుతున్న హంగామా మొత్తం సామ్ చుట్టూనే తిరగడం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. నాగ శౌర్యకు ఇటీవలే యాక్సిడెంట్ జరిగి రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అలాగే హాజరయ్యాడు. అలాంటిది ఓ మీడియా ఇంటర్వ్యూ లాంటిది కూడా బేబీ యూనిట్ ప్లాన్ చేసినట్టు లేదు. పైగా సీనియర్ నటీనటులు లక్ష్మీ రాజేంద్రప్రసాద్ రావు రమేష్ లాంటి సీనియర్లు ఎందరు ఉన్నా ఎవరిని ఎక్కువ ఫోకస్ చేయనివ్వడం లేదు.

ఆ మధ్య మజిలీకి ఇలా జరగడం వల్లే సెకండ్ హీరోయిన్ దివ్యంశు కౌశిక్ ప్రమోషన్ కు దూరంగా ఉందని టాక్ వచ్చింది. ఇప్పుడు ఓ బేబీ వరస చూస్తుంటే అదే నిజమనే అభిప్రాయం కలుగుతోందని ఫిల్మ్ నగర్ టాక్. మిక్కీ జె మేయర్ సంగీతం అందించన ఓ బేబీ కొరియన్ హిట్ మూవీ మిస్ గ్రానీకి అఫీషియల్ రీమేక్. జులై 5న విడుదలకు రెడీ అయ్యింది.