Begin typing your search above and press return to search.

సరదా .. సందడి కలిస్తే సమంత!

By:  Tupaki Desk   |   21 Sept 2021 5:00 AM IST
సరదా .. సందడి కలిస్తే సమంత!
X
సమంత తెరపైనే కాదు బయట కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఇక తాను ఏం చేస్తున్నది .. ఎక్కడికి వెళుతున్నది .. అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది. సమంతకు తెలుగు .. తమిళ భాషల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు భాషల్లోని హీరోయిన్లలో చాలామందితో ఆమెకి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లంతా కూడా తరచూ కలుసుకుంటూ ఉంటారు.

సమంత ఒక సినిమా ఒప్పుకుందంటే ఆ సినిమా పూర్తయ్యేవరకూ ఒక తపస్సులా దానిని పూర్తిచేస్తుంది. ఇక అదే సమయంలో ఆమె తమిళ సినిమాలు కూడా చేస్తూ వెళుతూ ఉంటుంది. ఈ రెండు భాషల్లో ఎప్పుడైనా షూటింగు లేని సమయం దొరికితే చాలు, ఆమె తన స్నేహితులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. వీకెండ్స్ లోను స్నేహితులతో కలిసి సందడి చేస్తుంది. సమంత తన ఇన్ స్టాలో తన సినిమాలకి సంబంధించిన వివరాలు .. విశేషాలతో పాటు, తన పర్సనల్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అలా ఆమె త్రిష .. కీర్తి సురేశ్ .. కల్యాణి ప్రియదర్శన్ .. ప్రీతమ్ జూకాల్కర్ తో కలిసి సరదాగా గడుపుతూ, అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. తెలుగులో సమంత 'శాకుంతలం' సినిమాను చేసింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఇక తమిళంలో ఆమె విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'కాతువాక్కుల రెండు కాదల్' అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ఈ రెండు సినిమాలు, సమస్త స్థాయిని మరింతగా పెంచుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.