Begin typing your search above and press return to search.

ఆలీ ఈజ్‌ ఏ డాళ్ళింగ్‌ -సమంత

By:  Tupaki Desk   |   13 April 2015 9:00 PM IST
ఆలీ ఈజ్‌ ఏ డాళ్ళింగ్‌ -సమంత
X
''ఇక్కడ నుండి.. ఇక్కడ వరకు.. సమంతలో నాకు నచ్చేది ఆ పార్ట్‌ మాత్రమే.. అది మన విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లా ఉంటుంది'' అంటూ కామెంట్లు చేశాడు సీనియర్‌ కమెడియన్‌ ఆలీ. మనోడు ఇలాంటి ఎడల్ట్‌ కామెడీలు చేయడంలో నిష్ణాతుడు. స్టేజీ మీద ఎవ్వరు ఉన్నా కూడా ధైర్యంగా పంచ్‌లు పేల్చేస్తాడు. అయితే ఈ సెటైర్‌పై సమంత రియాక్ట్‌ అవుతుందా మరి? అయ్యింది. ఏమంటుందంటే..

''దయచేసి ఆ విషయాన్ని పెద్దగా కాంట్రోవర్సీ చేయొద్దు ప్లీజ్‌. ఆలీ ఈజ్‌ ఏ డాళ్ళింగ్‌. అప్పుడు అత్తారింటి దారేది, ఇప్పుడు సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాల షూటింగ్‌ టైమ్‌లో ఆయన నాకో బెస్ట్‌ ఫ్రెండ్‌. ఆయన కచ్చితంగా కామెడీ చేయడానికి అలా కామెంట్‌ చేసుంటారు కాని, వేరే విధంగా అయితే మాత్రం అనుండరు. మీరు అనవసరంగా దాని గురించి ఎక్కువ మాట్లాడి ఇష్యూ చేయొద్దు'' అంటూ స్ట్రయిట్‌గా సెలవిచ్చేసింది సమంత. కట్‌ చేస్తే, ఈమె పక్కనే ఓ ఇంటర్యూలో కూర్చున్న ఆలీ.. ''నీకు తెలుసా ఇప్పుడు విజయవాడలో ఆ సర్కిల్‌ పేరు సమంత సర్కిల్‌ అని రీనేమ్‌ చేస్తున్నారు'' అంటూ మళ్ళీ జోకేశాడు. పకపకా నవ్వేసింది శ్యామ్‌. సో, సర్కిల్‌ ఏదైనా వీళ్ళు ఫ్రెండ్స్‌ అనమాట!!