Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌ కోరిక కూడా కాస్త పట్టించుకో సామ్‌

By:  Tupaki Desk   |   10 Feb 2020 4:10 PM GMT
ఫ్యాన్స్‌ కోరిక కూడా కాస్త పట్టించుకో సామ్‌
X
సమంత జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓబేబీ చిత్రంలో సమంత కెరీర్‌ బెస్ట్‌ యాక్టింగ్‌ చేసిందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి అంతకు మించి ప్రేక్షకులకు కన్నీరు తెప్పించే విధంగా సమంత జానులో నటించిందంటున్నారు. జాను చిత్రంతో ఈ అమ్మడి కెరీర్‌ లో మరో హిట్‌ పడ్డట్లే అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇక నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్మడి సినిమాల ఎంపిక మరియు పాత్రల ఎంపిక విషయంలో చాలా మార్పు వచ్చింది.

లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు లేదంటే పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలను మాత్రమే చేస్తోంది. ఇదే సమయంలో ఈ అమ్మడిని ఫ్యాన్స్‌ ఒక కోరిక కోరుతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో సమంత తల్లి అయితే చూడాలని.. ఇంత అందమైన అమ్మకు పుట్టబోతున్న బిడ్డ ఎలా ఉంటుందో చూడాలని.. ఈ ప్రేమ జంటకు పుట్టబోతున్న ఆ ప్రేమ ప్రతిరూపంను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నామంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజాగా జాను చిత్రం విడుదల తర్వాత సమంత చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అక్కడ కొంతమంది ఫ్యాన్స్‌ సమంతను కలిసేందుకు వచ్చారట. సమంత వారితో కొద్ది సమయం ముచ్చటించిందట. ఆ సమయంలోనే ఫ్యాన్స్‌ లో నుండి ఒకరు అక్క మీకు అబ్బాయి లేదా అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నాం అందట.

ఆ ఫ్యాన్‌ మాటలకు సమంత సిగ్గు పడుతూ నవ్వేసిందట. సమంత రెండు మూడు సంవత్సరాల తర్వాత పిల్లలను కనేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో గ్యాప్‌ తీసుకుంటానంటూ ఇటీవలే సమంత ప్రకటించిన నేపథ్యంలో ఆ గ్యాప్‌ పిల్లల కోసమేనేమో అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.