Begin typing your search above and press return to search.
ఆ అపోహను బ్రేక్ చేసిన సమంత!
By: Tupaki Desk | 25 Aug 2018 7:00 AM ISTటాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్....ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా....ఓ ట్రెండ్ కామన్. స్టార్ హీరోలు...5 పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లతో స్టెప్పులేస్తూ డ్యూయెట్లు పాడేస్తుంటారు. కానీ, ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా....మూడుపదులు దాటగానే పేకప్ చెప్పేస్తుంటారు. ఇక పెళ్లయిన తర్వాత హీరోయిన్లుగా రాణించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అయితే, టాలీవుడ్ బ్యూటీ - అక్కినేని వారి కోడలు సమంత ఆ ఆనవాయితీకి తాను అతీతం అని ప్రూవ్ చేసింది. పెళ్లి కాక ముందుతో పోలిస్తే పెళ్లయిన తర్వాత సామ్...వరుస హిట్లతో - వైవిధ్యమైన పాత్రలతో సక్సెస్ సాధిస్తోంది. ఇదే విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
తాను పెళ్లి తర్వాత సినిమాల్లో మార్కెట్ పడిపోతుందనే ఒక అపోహ ఉందని, దాన్ని బ్రేక్ చేయాలని తాను అనుకున్నానని సామ్ చెప్పింది. అనుకున్నట్టుగానే దానిని సక్సెస్ ఫుల్ గా బ్రేక్ చేశానని చెప్పింది. పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు ఆదరణ ఉండదని సినిమా వాళ్లు ప్రచారం చేశారని, కానీ, ప్రేక్షకులు అలా భావించడం లేదని తన సినిమాలతో ప్రూవ్ అయిందని సామ్ చెప్పింది. గతంలో కూడా చాలామంది హీరోయిన్లు ఈ తరహా విజయాన్ని సాధించారని తెలిపింది. తానీ స్థాయికి ఎదగడానికి విమర్శలే కారణమని, ఆ విమర్శలే మనం ఎదగడానికి దోహదపడతాయని చెప్పింది. ఆ పాత్రలో సమంత నటించలేదని అంటే....దానిని ఛాలెంజ్ లా తీసుకొని ఆ పాత్రలో నటింంచి రాణిస్తానని - అందుకోసం కఠినంగా శ్రమించడానికి సిద్ధపడతానని చెప్పింది. సమంత నటించిన యూటర్న్ - సీమదురై చిత్రాలు వచ్చే నెలలో విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.