Begin typing your search above and press return to search.

బ్యాంక్ బ్యాలెన్స్ కాదు.. అవి కావాలి

By:  Tupaki Desk   |   10 Nov 2017 10:51 AM IST
బ్యాంక్ బ్యాలెన్స్ కాదు.. అవి కావాలి
X
ఒక నటుడు ఎప్పుడైతే తన స్టార్ హోదాను పక్కనపెట్టి ఒక ప్రయోగాత్మకమైన పాత్రను చేస్తాడో అప్పుడే అసలైన నటుడిగా తనలో తనకి ఒక సంతృప్తి కలుగుతుంది. ఒక్కోసారి ఎన్నో కోట్ల బడ్జెట్ సినిమాలో నటించినా కూడా ఆ హ్యాపీ ఫీలింగ్ దొరకదు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది నటీనటులు సినిమా చిన్నదైనా.. రెమ్యునరేషన్ తక్కువైనా.. పట్టించుకోకుండా ఇష్టంగా సినిమాలని చేస్తున్నారు. సినిమా రిజల్ట్ తేడా వచ్చినా కూడా ఆ పాత్ర ఎంతో ఇష్టంగా చేశాను అనే జ్ఞాపకం అలా ఉండిపోతుంది.

అయితే ఇప్పుడు స్టార్ బ్యూటి సమంత కూడా అలాంటి పాత్రలను చేయడానికి రెడీ అంటోంది. ఇన్నాళ్ల నుంచి ఒకలెక్క ఎప్పుడొక లెక్క అనేలా మంచి పాత్ర దక్కితే రెమ్యునరేషన్ ని కూడా లెక్క చేయదట. ఇంకా ఏమంటోంది అంటే.. నన్ను స్టార్ సమంత గా చూడకండి. ఒక నటిగా గుర్తించండి. అప్పుడే కొత్తగా కనిపిస్తాను. ఎప్పుడు స్టార్ హోదా గ్లామర్ రెమ్యునరేషన్ కమర్షియల్ అనే చూడకూడదు. ఇక నుంచి వాటికి పుల్ స్టాప్ పెట్టాల్సిందే. సోషల్ ఎలిమెంట్స్ సినిమాలంటే నాకు ఇష్టమే.. వాటి వల్లే ఇప్పుడు నాకు ఈ స్థాయి వచ్చింది.

ప్రయోగాత్మకమైన పాత్రలు సమంత చేస్తుందా లేదా అనే వారికి నా చిన్న సలహా.. ఇప్పుడు నాకు కావాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ లు కాదు.. నాకంటూ సంతృప్తి ఇచ్చే పాత్రలు చేయాలని ఉంది. కొత్త తరహా పాత్రలు చేసి ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడుతున్నట్లు సమంత వివరించింది.