Begin typing your search above and press return to search.

సమంత రాక ఆలస్యం అయ్యేలా ఉంది

By:  Tupaki Desk   |   14 May 2019 10:30 PM GMT
సమంత రాక ఆలస్యం అయ్యేలా ఉంది
X
పెళ్లి తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ, సినిమాల సంఖ్య తగ్గించిందని చెప్పుకోవచ్చు. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఈమె ప్రాముఖ్యత ఇస్తోంది. ఇప్పటికే యూటర్న్‌ చిత్రంను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సమంత ఇటీవల మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ అయిన 'ఓ బేబీ' అనే చిత్రాన్ని చేసింది. సీనియర్‌ నటి లక్ష్మీతో కలిసి సమంత ఈ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. పూర్తిగా లో ఫ్రొఫైల్‌ లో ఈ చిత్రంను పూర్తి చేయడం జరిగింది.

షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు ఓ బేబి షూటింగ్‌ పూర్తి అయ్యింది, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అధికారికంగా తెలియజేశారు. అయితే సమంత మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్నా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సురేష్‌ బాబు 'ఓ బేబి' చిత్రంతో పాటు చాలా చిన్న సినిమాలను టేకోవర్‌ చేశాడు. ఆ సినిమాలతో పాటు ఈ సినిమా విడుదల తేదీని ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పెద్ద సినిమాల డేట్లతో క్లాష్‌ రాకుండా, తన సినిమాలకు మద్య గ్యాప్‌ మెయింటెన్‌ చేస్తూ సురేష్‌ బాబు సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఓ బేబి సినిమా విడుదలకు సురేష్‌ బాబు ఏ డేట్‌ ను మనసులో అనుకున్నాడో ఆయన నోటి నుండి వస్తే గాని మనకు క్లారిటీ రాదు. ఓ బేబి సినిమా విడుదలకు ఇంకా రెండు మూడు నెలలు కూడా సమయం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. సమంత మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆమె అభిమానులు మాత్రం 'ఓ బేబి' త్వరగా వచ్చేయ్‌ అంటున్నారు.