Begin typing your search above and press return to search.

బేబీ అక్కడ అదరగొట్టిందిగా!

By:  Tupaki Desk   |   7 July 2019 10:29 AM GMT
బేబీ అక్కడ అదరగొట్టిందిగా!
X
మొన్న విడుదలైన ఓ బేబీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. స్టార్ సపోర్ట్ లేకుండా కేవలం సమంతా ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని తీసిన ఈ కొరియన్ రీమేక్ కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా నైజామ్ లో బేబీ దూకుడు మాములుగా లేదు. మొదటి రోజు 60 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు అనూహ్యంగా 75 లక్షలు రాబట్టడం గమనార్హం. రెండు రోజులకు కోటి ముప్పై లక్షలకు పైగా షేర్ ఒక్క ప్రాంతం నుంచే అంటే చిన్న విషయం కాదు

ఇవాళ ఆదివారం కాబట్టి అదనపు స్క్రీన్ల అడ్వాంటేజ్ ని తీసుకుని ఎంత లేదన్నా కోటి రూపాయలకు పైగా షేర్ వస్తుందని ట్రేడ్ అంచనాలో ఉంది. మాములుగా మీడియం రేంజ్ సినిమాలకు ఇలా జరగదు. కానీ నందిని రెడ్డి టేకింగ్ సమంతా లక్ష్మి రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ చిత్రాన్ని ఇంకో లెవెల్ పైకి తీసుకెళ్లాయి. పెట్టుబడి రావడం గ్యారంటీ కావడంతో లాభాలు ఎప్పటి నుంచి వస్తాయని బయ్యర్లు లెక్కలు వేసుకుంటున్నారు.

ఒకవేళ రేపటి నుంచి వీక్ డేస్ లో పెద్దగా డ్రాప్ లేకపోతే ఓ బేబీ అద్భుతాలు చేయడం ఖాయమే. పోటీగా వచ్చిన బుర్రకథలో విషయం పెద్దగా లేకపోవడంతో పబ్లిక్ ఓ బేబీకే ఓటు వేస్తున్నారు.మిగిలిన ఏరియాలకు సంబంధించి కలెక్షన్ రిపోర్ట్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. చూస్తుంటే మజిలీ తర్వాత చాలా తక్కువ టైంలో సమంతా మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకునేలా ఉంది