Begin typing your search above and press return to search.

కొత్త లుక్ లో అక్కినేని కోడ‌లు షాక్

By:  Tupaki Desk   |   23 Dec 2019 8:24 AM GMT
కొత్త లుక్ లో అక్కినేని కోడ‌లు షాక్
X
సౌతిండియా టాప్ 10 క‌థానాయిక‌ ల్లో అక్కినేని కోడ‌లు స‌మంత పేరు ట్రెండింగ్ లో నిలుస్తోంది. త‌న‌దైన అందం అభిన‌యంతో నిరంత‌రం క్రేజీ నాయిక‌గా వెలుగుతున్న సామ్ కి వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా స‌హా సామాజిక మాధ్య‌మాల్లో స్పీడ్ త‌న‌కు ప్ర‌త్యేక ఫాలోయింగు ని తెస్తోంది. ఓ బేబి- మ‌జ‌లీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో త‌న ఇమేజ్ రెట్టింపైంది. సామ్ కు ఉన్న ఫాలోయింగ్ కి త‌గ్గ‌ట్టే ట్రెండ్ సెట్టింగ్ ఫ్యాష‌న్స్ తో అంత‌ర్జాలంలో హీట్ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య‌ను మ‌నువాడి అక్కినేని కోడ‌లు అయినా సామ్ స్వేచ్ఛా విహారం అభిమానుల్లో నిరంత‌రం హాట్ టాపిక్.

ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న జంట వైల్డ్ లైఫ్ ఎగ్జిబిష‌న్ లో సామ్ త‌ళుక్కున మెరిసింది. అక్క‌డ ఎంద‌రు సెల‌బ్రిటీ లు ఉన్నా అంద‌రిలో త‌నే హైలైట్ అయ్యింది. ముఖ్యంగా ఆరెంజ్ క‌ల‌ర్ జంప్ సూట్ లో ఈవెంట్ కే ప్ర‌త్యేక శోభ‌ను తెచ్చింది. అక్క‌డ సెల‌బ్రిటీలంతా త‌న‌పైనే దృష్టి సారించేంత ఆక‌ర్ష‌ణీయం గా క‌నిపించింది ఆ డిజైన‌ర్ డ్రెస్ లో. ఒక ర‌కంగా షో స్టాప‌ర్ గా నిలిచింది.

ఈ ఈవెంట్ కోసం ప్ర‌త్యేకంగా త‌న‌ని తాను డిజైన్ చేసుకుంది. ఎంచుకున్న డ్రెస్ కి త‌గ్గ‌ట్టే.. ఆ పెద‌వుల‌కు ముదురు రంగు లిప్ స్టిక్ .. ఉంగరాల జుట్టుతో తన రూపాన్ని పూర్తిగా మార్చేసింది సామ్. న‌డుముకి వ‌డ్డానంలా క‌నిపిస్తున్న ఆ బ్లాక్ బెల్ట్ లో డైమండ్స్ డిజైన్ ప్ర‌త్యేకం గా ఆక‌ర్షిస్తోంది. ఇక‌ గులాబీ పెదవులతో చిరున‌వ్వులు చిందిస్తూ సామ్ లుక్ వేడుక‌ కే హైలైట్ అయ్యింది. ఇక స‌మంత‌ న‌టించిన జాను (96 రీమేక్) త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. అటు పై హ‌బ్బీ నాగ‌ చైత‌న్య‌ కు జోడీగా ఓ చిత్రంలో న‌టించ‌నుంది. `ఫ్యామిలీ మ్యాన్- సీజ‌న్ 2` వెబ్ సిరీస్ లోనూ స‌మంత ఓ కీల‌క పాత్ర‌ లో న‌టిస్తోంది.