Begin typing your search above and press return to search.

ఇదంతా సమంతా మహత్యమేనా?

By:  Tupaki Desk   |   8 April 2019 9:53 AM IST
ఇదంతా సమంతా మహత్యమేనా?
X
నార్త్ లో కొంత వరకు నయం కానీ సౌత్ లో మటుకు హీరోయిన్లకు పెళ్ళైపోతే ప్రేక్షకుల తనను రిసీవ్ చేసుకునే దృక్పధంలో మార్పు వస్తుంది. అందులోనూ ఏదైనా పెద్ద స్టార్ హీరో కుటుంబానికి కోడలిగా వెళ్ళినప్పుడు అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. నిర్మాతలు సైతం ఆఫర్లు ఇచ్చే విషయంలో కాస్త ముందు వెనుక ఆలోచిస్తారు. కానీ సామ్ ఈ ట్రెండ్ కి రివర్స్ లో వెళ్తోంది.

శ్రీమతి ట్యాగ్ పడి ఏడాది దాటుతున్నా తన దూకుడు తగ్గించడం లేదు సరికదా ఫామ్ లో ఉన్న ఇతర హీరోయిన్లు అసూయ పడేలా క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. ఒకపక్క మజిలీలో భర్త అంటే ప్రాణమిచ్చే భార్యగా కట్టిపడేసే పెర్ ఫార్మన్స్ తో చైతుకు హిట్ రావడంలో సహాయపడగా దానికి బద్ధ వ్యతిరేకమైన పాత్రలో అటు సూపర్ డీలక్స్ లో సైతం అదిరిపోయే నటనతో ఔరా అనిపించింది.

ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఓ బేబీలో సమంతా చేస్తోంది మరో విభిన్నమైన పాత్రే. గత ఏడాది నుంచే సమంతా ఈ విషయంలో మంచి దూకుడు ప్రదర్శిస్తోంది. స్క్రిప్ట్ లను ఎంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నటనకు ఛాలెంజ్ అనిపించడంతో పాటు కాంబినేషన్ల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తోంది. అందుకే ఏడాదిన్నర కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే రంగస్థలం అభిమన్యుడు అదిరింది మహానటి లాంటి బ్లాక్ బస్టర్స్ అన్ని పెళ్లయ్యాక వచ్చినవే.

ఇప్పుడు తనకోసం వెయిట్ చేస్తున్న నిర్మాతల లిస్ట్ చాంతాడంత ఉందట. ఇంకో రెండు మూడేళ్ళ దాకా ఖాళీగా ఉండే పరిస్థితి లేదని ఇన్ సైడ్ టాక్. చూస్తుంటే ఇతర హీరోయిన్లకు పెళ్లయ్యాక కూడా కెరీర్ కు ఢోకా ఉండదనే భరోసా ఇచ్చేలా సమంతా తన కెరీర్ ని తీర్చిదిద్దుకుంటున్నట్టు కనిపిస్తోంది. మూడు ముళ్ళు పడితే ఎక్కడ ఆఫర్లు పోతాయో అని భయపడే భామలకు సమంతా ఇస్తున్న గ్యారెంటీ బాగుంది కదూ