Begin typing your search above and press return to search.

ఒకేసారి 8 సినిమాల్లో న‌టిస్తోంది

By:  Tupaki Desk   |   17 Oct 2015 3:00 PM IST
ఒకేసారి 8 సినిమాల్లో న‌టిస్తోంది
X
క్యూట్ స‌మంత మ‌నం చిత్రంలో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆ సినిమా త‌ర్వాత స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రంలో డీసెంట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆ త‌ర్వాత మాత్రం ఈ అమ్మ‌డు న‌టించిన వేరొక సినిమా ఏదీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. అయితే ప్ర‌స్తుతం కోలీవుడ్‌ - టాలీవుడ్‌ లో పూర్తి బిజీగా గ‌డిపేస్తోంది ఈ అమ్మ‌డు.

ఏక‌కాలంలో 8 సినిమాల్లో న‌టిస్తోంది అమ్మ‌డు. విజ‌య్ 59 - వ‌డ చెన్న‌య్‌ - 24 - 10 ఎంద్రాతుకుళ్ల‌ - తంగ మ‌గ‌న్‌ - అర్జున్ దివ్య మాతృమ్ కార్తిక్ .. చిత్రాలు ఈ అమ్మ‌డి కెరీర్‌ లో ఉన్నాయి. తెలుగులో బ్ర‌హ్మోత్స‌వం - అ.. ఆ సినిమాల్లోనూ న‌టిస్తోంది. ఇన్ని సినిమాల్ని ఒకేసారి ఎలా మ్యానేజ్ చేస్తుందో తెలీదు కానీ స‌మంత ఓపిక‌ను మెచ్చుకోవాల్సిందే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సరసన ‘అ...ఆ...’ (అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) చిత్రంలో న‌టిస్తోంది. అలాగే విజ‌య్ స‌ర‌స‌న క‌త్తి సినిమా త‌ర్వాత మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీలో న‌టిస్తోంది. అలాగే స‌మంత ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. ఫేవ‌రెట్ హీరో విజ‌య్‌. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌ తో వర్క్ చేశామంటే చాలు... జీవితమంతా స్నేహం చేస్తాం. ఎప్పటికీ అతణ్ణి ఇష్టపడతాం. గౌరవిస్తాం’’ అంటూ ట్వీట్ చేసింది అమ్మ‌డు.

అంటే ఇప్ప‌టికే ఎంద‌రో హీరోల‌తో న‌టించినా విజ‌య్‌ తో మాత్రం ప్ర‌త్యేకం అని చెప్ప‌క‌నే చెప్పింది. మ‌రి టాలీవుడ్‌ లో ఏ హీరోతో అయితే ఇష్టం? అన్న‌ది ఎప్పుడు చెబుతుంది? ఏమో! ఇప్ప‌టికైతే ఎనిమిది సినిమాల్ని ఒకేసారి బాగానే మ్యానేజ్ చేసేస్తోంది. బ‌హుశా హీరోలు, డైరెక్ట‌ర్ల‌తో ఉన్న స్నేహం వ‌ల్ల కంఫ‌ర్ట్ లెవ‌ల్ పెరిగి ఇలా చేయ‌గ‌లుగుతోంద‌ని అనుకోవ‌చ్చు.