Begin typing your search above and press return to search.

సమంతకు సెలవు ఇవ్వని కొరటాల!!

By:  Tupaki Desk   |   8 Jun 2016 4:13 PM IST
సమంతకు సెలవు ఇవ్వని కొరటాల!!
X
అ..ఆ.. చిత్రం విజయాన్ని అందరికంటే ఎక్కువగా హీరోయిన్ సమంత ఎంజాయ్ చేస్తోంది. సోషల్ నెట్వర్క్ లో అమ్మడి యాక్టివ్ నెస్ చూస్తే ఈ విషయం అర్ధమైపోతుంది. తోటి నటులు - టెక్నీషియన్స్ కంటే కూడా.. తనే ఎక్కువగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. దీంతో బాగా అలిసిపోయిన సమంతకు ఓ చిలిపి ఆలోచన వచ్చింది.

నిజానికి ఇవాల్టి నుంచి జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న జనతా గ్యారేజ్ షూటింగ్ లో సమంత జాయిన్ కావాల్సి ఉంది. ఈమేరకు షెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. అయితే.. పొద్దునే వాతావరణం చూసి షూటింగ్ కి డుమ్మా కొట్టాలనే ఆలోచన వచ్చింది ఈ అందాల భామకు. అందుకే దర్శకుడు కొరటాలకు ఓ వెరైటీ సెలవు చీటీ రాసి.. ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ లీవ్ లెటర్ చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు.

'ఇవాళ పని చేయకుండా ఉండేందుకు.. సరైన కారణం ఏం దొరకలేదు.."డియర్ శివ సార్.. నేను మేజికల్ వెదర్ తో బాధపడుతున్నాను"' అంటూ హైద్రాబాద్ లో చిరుజల్లులు పడుతూ చల్లగా ఉన్న విషయాన్ని ఇన్ డైరెక్టుగా చెప్పింది సమంత. మరి ఈ లీవ్ లెటర్ ను కొరటాల శివ యాక్సెప్ట్ చేసినట్లుగా లేడు. అందుకనే షూటింగ్ కు ఎంచక్కా హాజరైపోయింది. అంతే కాదు. ఎన్టీఆర్ తో కలిసి ఓ సూపర్బ్ డ్యాన్స్ సాంగ్ కు చిందులేసేస్తోంది. సెలవు పెట్టి మరీ షూటింగ్ హాజరయ్యి.. డ్యాన్సులు వేసేస్తోందంటే.. సమంత కమిట్మెంటే వేరబ్బా.