Begin typing your search above and press return to search.

స‌మంత హిందీ భాష‌ని పోస్ట్ మార్టం చేస్తోందా?

By:  Tupaki Desk   |   8 Oct 2022 9:56 AM GMT
స‌మంత హిందీ భాష‌ని పోస్ట్ మార్టం చేస్తోందా?
X
బాలీవుడ్ కెరీర్ పై స‌మంత సీరియ‌స్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ లో ఎంత బీజీగా ఉన్నా? బాలీవుడ్ కోసం కొంత స్పేస్ ని కేటాయించి ముందుకెళ్తోంది. దొరికిన ఏ ప్ర‌మోష‌న్ వేదిక‌ని విడిచిపెట్ట‌డం లేదు. లాంచింగ్ క‌న్నా ముందే? నార్త్ ఆడియ‌న్స్ కి రీచ్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇప్ప‌టికే కొన్ని ప్రాజెక్ట్ లు క‌మిట్ అయింది.

కానీ వాటి వివ‌రాలు ఎక్కడా లీక్ కాకుండా జాగ్ర‌త్త‌ త‌ప‌డుతోంది. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. తాజాగా 'సీటాడెల్' ఇండియా వెబ్ సిరీస్ కి ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ -2 తో దేశ వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకున్న సామ్ సీటాడెల్ ని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. ఈ సిరీస్ కోసం సామ్ హిందీ భాష‌కు సంబంధించి ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటోంది.

1990 నేప‌థ్యంలో సాగే సిరీస్ కావ‌డంతో హిందీ భాష‌లోనే ర‌క‌ర‌కాల స్లాంగ్ లు అవ‌స‌ర‌మ‌ని మేక‌ర్స్ సూచించ‌డంతో సామ్ అన్ని ర‌కాలుగా సిద్ద‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒకే భాష ప్రాంతాల ని బ‌ట్టి వివిధ ర‌కాల స్లాంగ్ లో మాట్లాడుతుంటారు. ఈ నేప‌థ్యంలో సామ్ హిందీ భాష‌ని అన్ని ర‌కాల స్లాంగ్ లు నేర్చుకుంటుంటోద‌ని తెలుస్తోంది.

దానికి సంబంధించి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటుంది. డే లో చాలా స‌మ‌యాన్ని హిందీ క్లాసుల‌కే కేటాయిస్తుందిట‌. హిందీ ట‌చ్ ఉన్న‌ప్ప‌టికీ అన్ని ర‌కాల స్లాంగ్స్ లో నేర్చుకోవ‌డం ఇబ్బందిక‌రంగానే మారుతోందిట‌. భాష ట‌చ్ ఉన్నా? ఒకేసారి అన్ని ర‌కాలుగా మాట్లాడాల్సి వ‌చ్చేస‌రికి శిక్ష‌ణ సైతం క‌ఠినంగా ఉంద‌ని అంటోంది.

త‌ప్పులు..ఒప్పులు అన్నింటిని క‌లిపి మాట్లాడుస్తున్నాను న‌వ్వేసింది. ఇక ఈ సిరీస్ చిత్రీక‌ర‌ణ కోసం న‌వంబ‌ర్ నుంచి వ‌ర్క్ షాపులు నిర్వ‌హించ‌డానికి రెడీ అవుతున్నారు. వాటిలో స‌మంత జాయిన్ అవుతుంది. అటుపై డిసెంబ‌ర్ తొలి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. రూసో బ్ర‌ద‌ర్స్ నిర్మిస్తోన్న సీటాడెల్ వివిధ భాష‌ల్లో ..వివిధ దేశాల్లో రూపొంద‌నుంది.

ఇదే సిరీస్ మాతృక‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక స‌మంత తెలుగులోనూ బిజీగా సినిఆమ‌లు చేస్తోంది. 'శాకుంతలం'..'య‌శోద' లాంటి లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న 'ఖుషీ' సినిమాలో న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.