Begin typing your search above and press return to search.
అందరి గుండెల్లో ఆయనే కింగ్.. కోడలు మురిపెం!
By: Tupaki Desk | 24 Aug 2020 10:15 AM ISTచూస్తుండగానే కాలం కరిగిపోతోంది. మొన్ననే షష్ఠిపూర్తి వేడుకలు జరుపుకున్నారా! అన్నట్టుగా ఇంకా నాగార్జున గురించి ముచ్చటిస్తూనే ఉన్నారు అభిమానులు. ఇంతలోనే మరో బర్త్ డే వచ్చేసింది. ఆగస్టు 29న కింగ్ నాగార్జున బర్త్ డే అన్న సంగతి తెలిసిందే. అక్కినేని హీరో బర్త్ డే సందర్భంగా అప్పుడే అభిమానులు సోషల్ మీడియాల్లో ప్రచారం హీటెక్కిస్తున్నారు. తాజాగా అక్కినేని కోడలు సమంత నాగార్జున బర్త్ డే కామన్ డీపీ (సీడీపీ)ని ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. కామన్ డీపీలో కింగ్ రకరకాల గెటప్పులు ఆకట్టుకున్నాయి.
``కింగ్ నాగార్జున బర్త్ డే డీపీ రిలీజ్ చేయడం చాలా గౌరవం. ఆయనపై ఎల్లవేళలా నా ప్రేమ గౌరవం ఉంటాయి. అందరి గుండెల్లో ఎప్పుడూ ఆయనే కింగ్`` అంటూ సామ్ ఉద్వేగానికి లోనైంది. ప్రపంచవ్యాప్తంగా కింగ్ నాగార్జునకు ఉన్న అశేష అభిమాన వర్గం ఈ డీపీని వైరల్ చేసేందుకు ప్రొఫైల్ లో షేర్ చేశారు.
కరోనా మహమ్మారీ పుణ్యమా అని కాలం ఎలా పరిగెడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ రిలీజ్ కి రావాల్సి ఉంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 4కి కూడా ఆయనే హోస్టింగ్ చేస్తున్నారు. అన్నపూర్ణ ఏడెకరాల్లో సెట్ వేసి మరీ ఈ షోని చిత్రీకరిస్తున్నారు. అన్నట్టు కామన్ డీపీ సంగతేమో కానీ.. ఈసారి బర్త్ డే కి అక్కినేని కోడలు సమంత `ఇంట్లో అందరికీ ఇష్టమైన` కానుకను ఇవ్వనుందో లేదో చూడాలి.