Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పెళ్లికూతురే జెల‌సీ ఫీల‌య్యేలా....!

By:  Tupaki Desk   |   7 Aug 2020 1:20 PM IST
ఫోటో స్టోరి: పెళ్లికూతురే జెల‌సీ ఫీల‌య్యేలా....!
X
పెళ్లికని వెళ్లి పెళ్లి కూతురినే డామినేట్ చేసేస్తే ఎలా? కానీ అంత ప‌నీ చేశారు అక్కినేని కోడ‌లు స‌మంత‌. క‌జిన్ రానా పెళ్లికి రెండ్రోజుల ముందు మెహందీ వేడుక‌లో సమంత న‌యా లుక్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప‌సుపు దుస్తుల్లో సువ‌ర్ణ సుంద‌రి లుక్ అల్లాడించేసింది అంతే. ఇదిగో అందుకు ఈ ఫోటోలే ప్రూఫ్. సోష‌ల్ మీడియాల్లో త‌నే స్వ‌యంగా మెహందీ వేడుక‌లో త‌న డ్రెస్సింగ్ సెన్స్ కు సంబంధించిన ఫోటోల్ని రివీల్ చేసింది.

ఈ వేడుక‌లో అక్కినేని కోడ‌లుని చూడ‌గానే చూప‌రుల క‌ళ్లు జిగేల్మ‌న్నాయి. ఇక కెమెరా ఫ్లాష్ లు అయితే అక్క‌డ కాసేపు ఊపిరాడ‌నివ్వ‌లేద‌ట‌. రానా దగ్గుబాటి - మిహీకా బజాజ్ జంట పెళ్లి సంబ‌రాల వేదిక వ‌ద్ద సామ్ ఇలా కనిపించింది. అతిథులంతా గురువారం సాయంత్రం మెహెందీ వేడుకకు హాజరయ్యారు. ఆ క్ర‌మంలోనే అక్కడికి ఖ‌రీదైన ప‌డ‌వ‌లాంటి కార్ లో దిగిన సామ్ లుక్ చూసి షాక్ తిన్నార‌ట‌. మెహందీలో దిగిన సువ‌ర్ణ సుంద‌రి అంటూ అంతా అటే చూస్తూ ఉండిపోయార‌ట‌.

ముద్ద‌బంతి పువ్వులా ప‌సుపు వ‌ర్ణం డిజైన‌ర్ డ్రెస్ కి తోడుగా.. స్మోకీ ఐస్ .. ఎర్రని గోళ్ల రంగు.. ముదురు రంగు లిప్ స్టిక్.. ఎత్తైన పోనీటైల్ .. ఊగిస‌లాడే చెవిపోగులు.. అస‌లు సమంత అందాన్ని పొగ‌డాలంటే క‌వుల‌కైనా కాస్త టైమ్ ఇవ్వాలంతే. మెహెందీ వేడుకకు వచ్చింది మొద‌లు వ‌ధువు మిహీక‌తో చాలా సమయం గ‌డిపింద‌ట‌. ఈ వేడుక‌లో మిహీక సన్నిహితులు.. కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక‌రోజు ముందు హ‌ల్దీ వేడుక జ‌రిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి స‌హా అతని కుటుంబ స‌భ్యులంతా హాజరయ్యారు. ఈనెల 8న వివాహం రామానాయుడు స్టూడియోస్ లో జ‌ర‌గ‌నుంది. కరోనావైరస్ మహమ్మారి కార‌ణంగా అతిథులు సురక్షితంగా ఉండేలా వేదికను బయో-సురక్షిత బబుల్ తో రూపొందిస్తున్నార‌ట‌. ఇత‌ర అన్ని జాగ్ర‌త్తలు పాటించ‌నున్నారు.