Begin typing your search above and press return to search.

ఊపి‌రి పీల్చుకోండి.. అంటూ కోడ‌లు రెబలిజం!

By:  Tupaki Desk   |   25 March 2021 4:58 PM GMT
ఊపి‌రి పీల్చుకోండి.. అంటూ కోడ‌లు రెబలిజం!
X
పెళ్లి త‌ర్వాత క‌ట్టుబాట్లు భార‌త‌దేశంలో నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌చ్చే అంశం. కానీ రంగుల ప్ర‌పంచానికి అది వ‌ర్తింప‌జేయ‌డం స‌రి కాదు. ఇది గ్లామ‌ర్ ని ఎలివేట్ చేసే ఇండ‌స్ట్రీ.. ఇక్క‌డ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు అడ్డు క‌ట్ట వేయ‌డం నేరం!

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో అక్కినేని కోడ‌లు హాట్ ఫోటోషూట్లు నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. స‌మంత పెళ్లి కి ముందు ఎలానో పెళ్లికి త‌ర్వాతా అలానే స్వేచ్ఛ‌గా కెరీర్ ప‌రంగా మ‌రింత దూకుడు గా క‌నిపించ‌డం చాలా కాలంగా చ‌ర్చ‌కొస్తూనే ఉంది. సామ్ రెగ్యుల‌ర్ సోష‌ల్ మీడియా హంగామా చూసిన వారంతా ఆ స్పీడ్ కి షాక్ తినాల్సిందే. సినీకెరీర్.. మోడ‌లింగ్ ప‌రంగా త‌న‌కు కుటుంబం స‌హా భ‌ర్త చైత‌న్య నుంచి కావాల్సినంత అండ‌దండ‌లున్నాయి. అందుకే సామ్ ఎంతో స్వేచ్ఛ‌గా ప్ర‌తిదీ ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌రు. ఈ రంగంలో త‌న‌దైన ఒర‌వ‌డితో దూసుకుపోయి క్రేజీ అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటున్నారు. నిజం చెప్పాలంటే పెళ్లి త‌ర్వాత సామ్ ఇమేజ్ మ‌రింత పెరిగింద‌నే చెప్పాలి.

ఇంత‌కుముందు సామ్ హాట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేశాయి. మ‌రోసారి బోల్డ్ గా ఫోజులివ్వ‌డం సెన్సేష‌న్ గా మారింది. సామ్ నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లుక్ ఇది. ఈ ఫోటోకి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చారు.

``ఊపి‌రి పీల్చుకోండి.. ప్రేమ ఊపిరులూదుతుంది.. రిలాక్స్ డ్ గా త‌ల వాల్చండి. అయినా నిద్ర కోల్పోవ‌డంలో అస్స‌లు అర్థ‌మే లేదు`` అంటూ ఈ ఫోటోకి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చారు. సామ్ లో రెబ‌లిజం ఎంత‌మాత్రం త‌గ్గ‌లేదు! అంటూ అభిమానులు స‌ర్ ప్రైజ్ అవుతున్నారు.

ఇటీవ‌ల శాకుంత‌లం ఈవెంట్లో.. మ‌హాశివ‌రాత్రి వేడుక‌లో సామ్ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించారు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లో క‌నిపిస్తున్నారు. ఇది బ్రాండ్ ప‌బ్లిసిటీ కోస‌మేనని అభిమానుల‌కు అర్థ‌మైంది. స‌మంత న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. త‌దుప‌రి గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలం చిత్రంలో స‌మంత న‌టిస్తోంది.