Begin typing your search above and press return to search.

స‌మంత ప్ర‌య‌త్న‌మంతా వృథా ప్ర‌యాసేనా?

By:  Tupaki Desk   |   26 April 2022 11:30 AM GMT
స‌మంత ప్ర‌య‌త్న‌మంతా వృథా ప్ర‌యాసేనా?
X
స్టార్ హీరోయిన్ స‌మంత కెరీర్ విడాకుల త‌రువాత మాంచి రైజింగ్ లో వున్న‌ట్టుంది. హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడిపోతున్నానంటూ ప్ర‌క‌టించిన స‌మంత ఆ త‌రువాత కొన్ని రోజులు డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది. ఆ త‌రువాత త‌న స్రేహితురాళ్ల‌తో క‌లిసి ఆధ్యాత్మిక యాత్ర‌కు వెళ్లిన సామ్ తిరిగి వ‌చ్చాక 'ఊ అంటావా ఊహూ.. 'అంటావా అంటూ 'పుష్ప‌'లో స్పెష‌ల్ సాంగ్ చేసి బౌన్స్ బ్యాక్ అయిన విష‌యం తెలిసిందే. ఒక్క‌సారిగా ఆ ఐట‌మ్ నంబ‌ర్ లో పాన్ ఇండియా లెవెల్లో పాపుల‌ర్ అయి టాప్ లోకి వెళ్లిన స‌మంత ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని అంగీక‌రిస్తూ వ‌రుస షాకులిస్తోంది.

విడాకుల త‌రువాత నుంచి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ప‌రంగా జోరు పెంచిన సామ్ సినిమాల విష‌యంలోనూ అదే జోరుని కొన‌సాగిస్తూ ఫిల్మ్ సెల‌బ్రిటీస్ తో పాటు ఇండస్ట్రీ వ‌ర్గాల‌ని విస్మ‌య‌ప‌రుస్తోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ చారిత్రాత్మ‌క చిత్రం 'శాకుంత‌లం'ని పూర్తి చేసిన స‌మంత ఈ మూవీ రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్న గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న కార్య‌క్ర‌మాల్లో బిజీగా వున్నారు.

ఫ‌స్ట్ లుక్ భారీ రేంజ్ లో సినిమాపై బ‌జ్ ని క్రియేట్ చేస్తుంద‌ని అంతా ఊహించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. సామ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఎక్స్ పెక్టేష‌న్స్ ని రీచ్ కాలేక‌పోయింది. దీంతో ఈ సినిమాలో స‌మంత న‌టించింద‌న్న విష‌యం ఇప్ప‌టికీ చాలా మందికి తెలియ‌దు.

సినిమా పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్నా సామ్ సినిమా అని మాత్రం ఏ ఒక్క‌రూ చెప్పుకోక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. దీంతో స‌మంత ఫ్యాన్స్ అప్ సెట్ అవుతున్నార‌ట‌.

క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి స‌మంత శ్ర‌మించిన సినిమా 'శాకుంత‌లం'. అలాంటి సినిమా గురించి ఇప్ప‌టికీ ఎవ‌రూ మాట్లాడుకోక‌పోవ‌డంతో మ‌రీ ఈ రేంజ్ లో సినిమా కు ప‌బ్లిసిటీ కూడా చేసుకోవ‌డం లేద‌ని స‌మంత ఫ్యాన్స్ ఫీల‌వుతున్నార‌ట‌. ఎంతో క‌ష్ట‌ప‌డి స‌మంత చేసిన ప్ర‌య‌త్నం వృథా ప్ర‌యాసేనా అని వాపోతున్నార‌ట‌. గ‌త కొన్ని నెల‌లుగా విడాకుల ప్ర‌క‌ట‌న కార‌ణంగా సామ్ మెంట‌ల్ గా, ఫిజిక‌ల్ గా కొంత డిప్రెష‌న్ కు లోన‌య్యారు.

ఆ ఫీల్ ని 'శాకుంత‌లం' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి ఊర‌ట‌నిస్తుంద‌ని సామ్ హోప్ పెట్టుకుంద‌ట‌. కానీ ప‌రిస్థితులు మాత్రం మ‌రోలా వున్నాయ‌ని, అస‌లు సామ్ ఈ సినిమా చేసిందంటే ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని అభిమానులు వాపోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం స‌మంత లేడీ ఓయియెంటెడ్ ఫిల్మ్ 'య‌శోద‌'లో న‌టిస్తూ ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో 'శాకుంత‌లం' నుంచి బిగ్ అప్ డేట్ వ‌స్తే బాగుంటుంద‌ని స‌మంత‌తో పాటు అంతా భావిస్తున్నార‌ట‌. కానీ మేక‌ర్స్ మాత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో వుంటూ సినిమా ప్ర‌మోష‌న్స్ ని ప‌ట్టించుకోక‌పోవ‌డం ఫ్యాన్స్ ని చిరాకు పెట్టిస్తోంద‌ని ఇన్ సైడ్ టాక్‌.