Begin typing your search above and press return to search.

సమంత 'కర్మ థీమ్‌' చాలెంజ్‌...వైర‌ల్!

By:  Tupaki Desk   |   10 Sept 2018 10:12 PM IST
సమంత కర్మ థీమ్‌ చాలెంజ్‌...వైర‌ల్!
X
వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ నెల 13న స‌మంత న‌టించిన `యూ ట‌ర్న్` విడుద‌ల కాబోతోన్న సంగతి తెలిసిందే. విభిన్న క‌థతో క‌న్న‌డలో తెర‌కెక్కిన యూట‌ర్న్ ను తెలుగులో స‌మంత లీడ్ రోల్ లో రీమేక్ చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక తాజాగా విడుద‌ల చేసి క‌ర్మ థీమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా స‌మంత‌....ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు క‌ర్మ థీమ్ ఛాలెంజ్ ను విసిరింది. `#యూటర్న్‌డాన్స్‌చాలెంజ్ `పేరిట అనిరుధ్ కంపోజ్ చేసిన క‌ర్మ థీమ్ సాంగ్ కు స్టెప్పులేయాలంటూ కొంత‌మందికి సవాల్‌ విసిరింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ చాలెంజ్ వైర‌ల్ అయింది.

ఐస్ బ‌కెట్ చాలెంజ్ - ఫిట్ నెస్ చాలెంజ్...ప్యాడ్ మ్యాన్ చాలెంజ్....గ్రీన్ చాలెంజ్...ఇలా ప్ర‌స్తుతం చాలెంజ్ ల ట్రెండ్ న‌డుస్తోంది. అలాగే తాజాగా స‌మంత టాలీవుడ్ లో `#యూటర్న్‌డాన్స్‌చాలెంజ్ `ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. దీంతో, అఖిల్‌ అక్కినేని తొలుత‌ ఈ చాలెంజ్‌ను స్వీకరించాడు. ఆ తర్వాత హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, నవీన్‌ చంద్రతో పాటు సామ్ ఫ్యాన్స్ అంతా ఈ చాలెంజ్ ను స్వీకరించారు. వారంతా ఆ పాట‌కు స్టెప్పులేసి ...ఆ వీడియోను స‌మంత‌కు ట్వీట్ చేస్తున్నారు. త‌న ఫేవ‌రెట్ హీరోయిన్ జెస్సీ కోసం ఈ చాలెంజ్ స్వీక‌రించాన‌ని...ఆ వీడియోను న‌వీన్ చంద్ర ట్వీట్ చేశాడు. త‌న అభిమాన హీరోయిన్ స‌మంత కోసం ఆ పాట‌కు డ్యాన్స్ చేశాన‌ని...త‌న‌ను ఆపాట ఎంతో ఆక‌ట్టుకుంద‌ని లావ‌ణ్య ట్వీట్ చేసింది.