Begin typing your search above and press return to search.
'పుష్ప' ఐటమ్ సాంగ్ అప్డేట్: వింటర్ లో వేడిపుట్టిస్తున్న సమంత..!
By: Tupaki Desk | 8 Dec 2021 8:00 PM ISTస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ''పుష్ప: ది రైజ్'' సినిమాలో సామ్ ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బన్నీ - సమంతల మీద ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ ప్రత్యేక గీతానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
పుష్పరాజ్ తో కలిసి సమంత చిందులేసిన 'ఊ అంటావా.. ఊఊ అంటావా' అనే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోని డిసెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇది 'సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అవుతుందని.. క్వీన్ సామ్ స్టెప్పులతో ఈ శీతాకాలం వేడెక్కబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా పాటలోని సమంత స్టిల్ ని వదిలారు. ఇందులో ఓర చూపులు చూస్తూ.. ఎవరినో రమ్మన్నట్టుగా అమ్మడు పోజ్ ఇచ్చింది.
'ఊ అంటావా..' సాంగ్ తో సమంత హీట్ పెంచబోతుందని పోస్టర్ లో ఆమె డ్రెస్సింగ్ చూస్తే అర్థం అవుతోంది. ఐటమ్ సాంగ్స్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసే డైరెక్టర్ సుకుమార్.. ఈ గీతాన్ని మరింత స్పెషల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి అదిరిపోయే మాస్ ట్యూన్ కంపోజ్ చేయగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారని సమాచారం. అంతేకాదు దీని కోసం గణేష్ ఆచార్యతో పాటుగా పలువురు కొరియోగ్రాఫర్స్ వర్క్ చేసారని టాక్ నడుస్తోంది.
తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ పాట రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ - సుకుమార్ - దేవిశ్రీప్రసాద్ కలయికలో ఇంతకముందు వచ్చిన 'అ అంటే అమలాపురం' 'రింగ రంగ' సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మరి ''పుష్ప:ది రైజ్'' కోసం చేసిన ఐటమ్ నంబర్ 'ఊ అంటావా..' ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన నాలుగు పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.
కాగా, 'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ - అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న ఈ సినిమా పార్ట్-1 రిలీజ్ కానుంది.