Begin typing your search above and press return to search.

బ‌న్ని వ‌ల్ల సమంత ఎంతో హ్యాపీ

By:  Tupaki Desk   |   12 Jan 2022 4:30 AM GMT
బ‌న్ని వ‌ల్ల సమంత ఎంతో హ్యాపీ
X
ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ స‌డెన్ గా ఐట‌మ్ నంబ‌ర్ చేయాల్సి వ‌స్తే వెంట‌నే అంగీక‌రించాలంటే దానికి స‌రైన కార‌ణం ఉండాలి. ప్రేర‌ణ కావాలి. అయితే ఆ ప్రేర‌ణ‌ను ఇచ్చింది బ‌న్ని అని చెబుతోంది అందాల స‌మంత‌. ఓవైపు వ్య‌క్తిగత జీవితంలో కుదుపు.. మ‌రోవైపు కెరీర్ కోసం ఆరాటం.. ఇలాంటి స‌న్నివేశంలో త‌న‌కు ఊ అంటావా.. ఊఊ అంటావా..! పాట‌లో న‌ర్తించే అవ‌కాశం ద‌క్కింది. పుష్ప - ది రైజ్ లోని ఈ ఐట‌మ్ నంబ‌ర్ యూత్ ని ఓ ఊపు ఊపింది. దానికి కార‌ణం స‌మంత గ్రేస .. అద్భుత‌మైన డ్యాన్స్ మూవ్ మెంట్స్. బ‌న్నీతో క‌లిసి ఎంతో సింక్ అయ్యి నృత్య‌భంగిమ‌ల‌తో అద‌ర‌గొట్టింది సామ్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యూత్ ని ఉర్రూత‌లూగించింది ఈ పాట‌. స‌మంత పేరు ఇటీవ‌ల ఒక రేంజులో మార్మోగుతోంది అంటే దానికి కార‌ణం ఊ అంటావా..! అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే అంత గొప్ప అవ‌కాశాన్ని త‌న‌కు క‌ల్పించిన బ‌న్నీకి కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌కుండా ఆగ‌లేక‌పోయింది సామ్.

`ఊ అంటావా..` తన కెరీర్ మొదటి ఐట‌మ్ నంబ‌ర్ కావ‌డంతో ఇందులో చేయాలా వ‌ద్దా? అని స‌మంత తొలుత సంశ‌యించింది. ప్రత్యేక గీతం కావడం వల్ల తాను దీన్ని చేయడానికి ఇష్టపడలేదని అయితే అల్లు అర్జున్ ప్రేరణ వల్ల ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నానని సమంత తెలిపింది. ఈ పాట‌లో చేసేందుకు తనకు హామీ ఇచ్చిన అల్లు అర్జున్ కి ధన్యవాదాలు. తెలిపింది. ``చాలా అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. పాట ఎలా ఉంటుందోనని భయపడి నేను సిద్ధంగా లేను. కానీ అల్లు అర్జున్ నన్ను కూర్చోబెట్టి పాట గురించి వివ‌రించి ఒప్పించాడు. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను `ఊ అంటావా..` చేయడానికి అంగీకరించను`` అని సమంత తెలిపింది.

ఏదేమైనా స‌మంత ఈ పాట‌లో న‌ర్తించ‌డానికి కార‌ణం సుకుమార్ మాత్ర‌మేన‌ని భావించిన వారికి ఇప్పుడు పూర్తి క్లారిటీ వ‌చ్చింది. రంగస్థ‌లం ద‌ర్శ‌కుడి ప్ర‌పోజ‌ల్ కి అంగీక‌రించే ముందు బ‌న్నీ ఇచ్చిన భ‌రోసా.. న‌మ్మ‌కంతోనే స‌మంత ఊ అంటావా పాట‌కు అంగీక‌రించింది అన్న‌మాట‌. సామ్ త‌దుప‌రి బాలీవుడ్ లో వ‌రుస చిత్రాలు చేయ‌నుంది. వీటికి హైప్ తెచ్చేందుకు పుష్ప - హిందీ విజ‌యం స‌హ‌క‌రిస్తోంది. పాన్ ఇండియా స్టార్ గా సామ్ బ్రాండ్ ఇప్పుడు మార్మోగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2లో అవ‌కాశం క‌ల్పించిన రాజ్ అండ్ డీకే మ‌రో వెబ్ సిరీస్ ని స‌మంత‌తో ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ త‌న‌కు హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లేందుకు రాచ‌బాట వేస్తున్నాయ‌న్న‌మాట‌.