Begin typing your search above and press return to search.

షాక్‌ : సమంత బైసెక్సువల్‌ గా మరాబోతుందట!

By:  Tupaki Desk   |   26 Nov 2021 10:43 AM IST
షాక్‌ : సమంత బైసెక్సువల్‌ గా మరాబోతుందట!
X
సమంత సినీ కెరీర్ ని ప్రారంభించి దశాబ్దకాలం పూర్తి అయింది. ఈ దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేనంత బిజీ గా ఈ మధ్య కాలంలో సమంత కనిపిస్తుంది. ఒకవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో హల్‌ చల్‌ చేయడంతో పాటు మరో వైపు పలు భాషల్లో సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లను కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే తమిళంలో ఈమె నటించిన ఒక సినిమా విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు లో ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా ను పూర్తి చేసింది. శాకుంతలం సినిమా కు ఇటీవలే ఈమె అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ చెప్పడం జరిగింది. సమంత బాలీవుడ్ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలో ఆమె హాలీవుడ్లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాను అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమా తో హాలీవుడ్ కి వెళ్ళబోతున్న ట్లుగా సమంత పేర్కొంది. ఈ సినిమాను సునీత తాటి హాలీవుడ్లో నిర్మించబోతున్నారు. ఓ బేబీ సినిమా నిర్మించిన సునీత తాటి సమంతను హాలీవుడ్ లో పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించబోతున్నట్లు గా కూడా సమంత పేర్కొంది. ఈ సినిమాలో నటించేందుకు చాలా ఉత్సాహంతో ఆసక్తిగా ఉన్నట్లు గా సమంత చెప్పుకొచ్చింది. ఈ సినిమా లో సమంత ఆశ్చర్యకరంగా బై సెక్సువల్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవలే సమంత నాగచైతన్య నుండి విడిపోయినట్లు గా ప్రకటించిన విషయం తెలిసిందే.

వైవాహిక జీవితం కొనసాగించే సమయంలో సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి వివరించినట్లుగా సమంత కనిపించేది. కానీ ఇప్పుడు ఆమె వరుసగా చేస్తున్న సినిమాలు చూస్తూ ఉంటే ఆమె ఇన్నాళ్లు తన చుట్టు వేసుకున్న కంచెను దాటేసినట్లుగా అనిపిస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈమె స్పీడ్‌ మరియు సినిమాల ఎంపిక విధానం చూసి ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పుష్ప ఐటెం సాంగ్ లో కూడా సమంత నటించిన విషయం తెలిసిందే. ఇంకా మరెన్నో ప్రాజెక్టులలో సమంత నటించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రాబోయే రెండేళ్లలో సమంత ఫుల్ బిజీగా సామ్‌ మారబోతుంది.

హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళం తెలుగు హిందీ హాలీవుడ్ ఇలా ప్రతి ఒక్క భాషలో కూడా సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు సమంత చేయబోతోంది. హాలీవుడ్ లో మొదటి సినిమానే బై సెక్సువల్ అమ్మాయి పాత్రను చేయడం కాస్త హాట్ టాపిక్ అయ్యింది.

సమంత మరీ ఇంత బోల్డ్‌ గా మారడం అవసరమా అంటూ కొందరు అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. కాని నటిగా ఆమె అన్ని పాత్రల్లో నటించాలని.. తనను తాను నిరూపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ విషయంలో ఆమెను చాలా మంది అభినందిస్తూ ఉన్నారు.