Begin typing your search above and press return to search.

స్లీపర్ సెల్ గా సామ్ పాన్ ఇండియా వైడ్ ఫేమస్ కానుందా...?

By:  Tupaki Desk   |   22 July 2020 2:30 AM GMT
స్లీపర్ సెల్ గా సామ్ పాన్ ఇండియా వైడ్ ఫేమస్ కానుందా...?
X
అక్కినేని సమంత 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ ద్వారా డిజిటల్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఇది 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 1కు కొనసాగింపుగా వస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ ను రాజ్‌ నిడిమోరు - కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ మంచి ఆదరణని దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి ఏర్పడింది. స్పై థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్‌ లో సమంత నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. అది కూడా ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్ర అని.. స్లీపర్ సెల్ అని వార్తలు వస్తున్నాయి. చేతిలో వెపన్స్ పట్టుకుని సామ్ ఇప్పటి వరకూ చేయని స్టంట్స్ చేయబోతుందని అంటున్నారు. అయితే సామ్ ది నెగిటిల్ రోల్ అయిన‌ప్ప‌టికీ ఫుల్ ఎమోష‌న‌ల్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. స‌మంత ఎందుక‌ని అలా స్లీప‌ర్ సెల్ గా మారిపోయింద‌నే స్టోరీ చాలా బాగా వ‌చ్చిందని.. ఈ దెబ్బ‌తో సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత పాన్ ఇండియా వైడ్ ఫేమస్ అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాయ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రియమణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 లోనూ తన పాత్ర కొనసాగుతుందని.. మనోజ్‌ కు భార్యగానే తన క్యారెక్టర్ ఉంటుందని.. సమంత పాత్ర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఉంటుందని చెప్పుకొచ్చింది. దీనిని బట్టి చూస్తే సామ్ పాత్ర ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చూడని విధంగా ఉంటుందని అర్థం అవుతోంది. ఇప్పటికే సమంతకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ కూడా అయిందని సమాచారం. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానుంది. అయితే సమంత నెగిటివ్ రోల్ లో కనిపిస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో విక్రమ్ హీరోగా వచ్చిన '10' అనే సినిమాలో కూడా సమంత ఒక పాత్రలో విలన్ గా కనిపించింది. మరి మరోసారి 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కోసం అలాంటి ప్రయత్నమే చేస్తున్న సామ్ కి ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి.