Begin typing your search above and press return to search.

సమంతకు ఆఫర్ల వెల్లువ... ?

By:  Tupaki Desk   |   7 Oct 2021 5:00 AM IST
సమంతకు ఆఫర్ల వెల్లువ... ?
X
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది. ఆ ఇద్దరూ ఎందుకు విడిపోయారు, కారణాలు ఏంటి అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో అతి పెద్ద రిసెర్చ్ సాగుతూనే ఉంది. గాంధీ జయంత్రి రోజున సైలెంట్ గా బాంబు పేల్చినట్లుగా ట్విట్టర్ వేదికగా ఈ స్టార్ కంపుల్ తాము విడిపోతున్నట్లుగా చెప్పేసి ఊరుకున్నారు. ఆ తరువాత రచ్చ అంతా ఇంతా కాదు, ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానాలు చేసుకుంటూ పోతున్నారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న ఇష్యూతో అతి పెద్ద డిబేట్ కూడా చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉండగానే సమంత చైతూ తమ పనుల్లో తాము బిజీ అయిపోతున్నారు. ఎవరి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీద వారికి పక్కా క్లారిటీ ఉంది. సమంత బాలీవుడ్ లో సెటిల్ అవుతుంది అని అందరూ ఊహిస్తున్నా ఆమె తనను ఇంతలా పెంచి పోషించిన టాలీవుడ్ ని వీడిపోదు అన్న మాట కూడా వినిపిస్తోంది. నానక్ రాం గూడాలో ఒక అతి ఖరీదైన అపార్ట్మెంట్ లో సమంత ఇక పైన నివాసం ఉంటూ టాలీవుడ్ మీద ఒక కన్నేసి ఉంచుతారు అంటున్నారు.

ఆమె ఇపుడు ఏమీ ఖాళీగా లేదు, ఒక వైపు యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. అదే టైం లో ఆమె బాలీవుడ్ లో మూవీస్ మీద డిస్కషన్ చేస్తోందిట. ఇక టాలీవుడ్ లో గుణశేఖర్ మూవీ శాకుంతలం రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ తరువాత ఆమె మరిన్ని సినిమాలు తెలుగులో చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఆమెకు కధలు వినిపించేందుకు కూడా కొందరు నిర్మాతలు సిధ్ధంగా ఉన్నారని టాక్. అలాగే సమంతకు సరిపోయే స్క్రిప్టులను తయారు చేసే పనిలో రచయితలూ ఉన్నారుట. సమంత ఈ మధ్యన ట్విట్టర్ వేదికగా ఒక మాట చెప్పింది. తాను హైదరాబాద్ లోనే ఉంటాను అని. దానికి తగినట్లుగానే ఆమె తన కెరీర్ ని డిజైన్ చేసుకుంటోంది అంటున్నారు. సమంత ఓకే అంటే ఆమెతో సినిమాలు చేసేందుకు కూడా చాలా మంది మేకర్స్ రెడీగా ఉన్నారని టాక్. మొత్తానికి సమంత టాలీవుడ్ లో ఇక మీదట ఏ ఏ జానర్లలో మూవీస్ చేస్తుంది. ఏంటి అన్నదే చర్చగా ఉంది మరి. చూడాలి.