Begin typing your search above and press return to search.

సమంతకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న కాల్స్‌

By:  Tupaki Desk   |   18 Sept 2020 5:00 PM IST
సమంతకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న కాల్స్‌
X
సెలబ్రెటీల ఫోన్‌ నెంబర్‌ దొరికితే చాలు మాట్లాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే సెలబ్రెటీలు వారి నెంబర్‌ లను ఎక్కువగా బయట ఇవ్వరు. ముఖ్యంగా స్టార్స్‌ వారి మేనేజర్‌ నెంబర్స్‌ మాత్రమే ఇస్తూ ఉంటారు. ఎవరు మాట్లాడాలి అనుకున్నా కూడా వారి వారి మేనేజర్‌ లతో మాట్లాడాల్సి ఉంటుంది. కాని ఎలా వెళ్తాయో తెలియదు కొన్ని సార్లు స్టార్స్‌ నెంబర్స్‌ ఆకతాయిల వద్దకు వెళ్తాయి. సమంత ఆకతాయిల కాల్స్‌ తో చాలా ఇబ్బంది పడుతుందట. ఆమె ఇప్పటి వరకు చాలా నెంబర్స్‌ మార్చినా కూడా ఆమె మళ్లీ మళ్లీ ఆకతాయిల బారిన పడుతుందట.

సమంతకు ప్రతి రోజు ఎన్నో తెలియని వారి నుండి కాల్స్‌ వస్తూ ఉంటాయట. దాంతో పాటు మెసేజ్ లు కూడా వస్తాయని ఆమె చెబుతుంది. మెసేజ్‌ల్లో చాలా మంది మీతో మాట్లాడాలి. మీరు అంటే చచ్చేంత ఇష్టం అంటూ చెబుతూ ఉంటారట. కాల్స్‌ మరియు మెసేజ్‌ వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. పదే పదే కాల్స్‌ చేయడం వల్ల వర్క్‌ పై ఫోకస్‌ పెట్టలేం. అదే సమయంలో మనశ్శాంతి కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుందట. పర్సనల్‌ నెంబర్‌ ఎవరికి ఇవ్వకుండా ఉంచుకున్నా కూడా అది ఏదోలా బయటకు వెళ్తుందట. ఇది కేవలం సమంత సమస్య మాత్రమే కాదు. చాలా మంది సెల్రబెటీలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు.