Begin typing your search above and press return to search.

​ప్రశ్నలు మార్చండి అంటే వినరే!!

By:  Tupaki Desk   |   15 July 2017 6:00 AM IST
​ప్రశ్నలు మార్చండి అంటే వినరే!!
X

ఇప్పుడు చాలమంది స్టార్లు మీడియా ముందుకు రావడానికి కొంచం కష్టపడుతున్నారు. వాళ్ళకి ఇష్టంలేక కాదు కాకపోతే అడిగిన ప్రశ్నే పదే పదే అడిగి వాళ్ళని కొంచెం ఇబ్బందిపెట్టేస్తున్నారని. ప్రతి చోటా అవే సమాధానాలు ఇచ్చి ఇచ్చి విసుగు చెందుతున్నారు. ఇదిగో ఇప్పుడు అక్కినేని వారి కొత్త కోడలు సమంతకు కూడా అలాంటి పరిస్థితి వచ్చిందిట.

కొన్ని మీడియా ఇంటర్వ్యూలలో ఇప్పుడు సమంతకు ఎదురైన ప్రశ్నలు అన్నీఅయితే పెళ్లి గురించే లేకపోతే పెళ్లి తర్వాత మీరు నటనకు దూరం కాబోతున్నారా అనే ప్రశ్నలే. పెళ్లి దగ్గరపడుతున్న కొద్ది ఆమె సినిమాలు చేసే స్పీడ్ మరింత పెంచింది. పైగా మొన్న హాండ్లూమ్ కోసం చేసిన హాట్ ఫోటో షూట్ అందరికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ముందు ఎన్నడూ ఇంతలా హాట్ గా కనిపిచిందిలేదు. మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ గురించి ఒక వివరణ కూడా ఇచ్చింది. అదే ఇంటర్వ్యూలో సమంతకు ఒక ప్రశ్నకు పిచ్చ కోపం వచ్చేసింది.

ఒక జర్నలిస్టు మీరు పెళ్లి తరువాత నటన కొనసాగిస్తారా లేక నటనకు స్వస్తి పలికేస్తారా అనే ప్రశ్నకు సమంతకు కోపం వచ్చిన దానిని దిగమింగి “నటన అనేది కూడా అన్ని వృత్తుల లాంటిదే. ఇదే ప్రశ్న ఒక టీచర్కు కానీ డాక్టర్ కానీ ఎందుకు మీరు అడగారు” అని తిరిగి ప్రశ్నించింది. ఈ సమాధానంతో అందరి అనుమానాలు తీరిపోయినట్లే ఇక సమంత పెళ్లి తరువాత కూడా నటన కొనసాగిస్తుంది అన్నమాట.