Begin typing your search above and press return to search.

టర్నింగ్ తీసుకోవడానికి సమంత రెడీ

By:  Tupaki Desk   |   1 Dec 2017 5:00 PM IST
టర్నింగ్ తీసుకోవడానికి సమంత రెడీ
X
సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత అక్కినేని ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉందంటే నెక్స్ట్ ఇయర్ వరకు మరికొన్ని సినిమాలకు ఒకే చేయలేని పరిస్థితి. అయినా సమంత ఇప్పటి నుంచి స్టార్ హీరోలతో చేయడం కన్నా ఎక్కువగా కొత్త కంటెంట్ ఉన్న కథలనే చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది. అంతే కాకుండా ఆ కథలలో తనకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ - రంగస్థలం అలాగే సావిత్రి బయోపిక్ - మహానటి షూటింగ్ లతో చాలా బిజీగా ఉంది సమంత. అంతే కాకుండా మరో మూడు తమిళ సినిమాలను చేస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే సమంత ఒక కన్నడ సినిమాను తెలుగు - తమిళ్ లో రీమేక్ చేయాలనీ చాలా రోజుల నుంచి ఆలోచిస్తోన్న సంగతి తెలిసింద. గత ఏడాది కన్నడ లో వచ్చిన యు టర్న్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ కథ సమంతకు తెగ నచ్చేసిందట దీంతో ఎలాగైనా సినిమాను టాలీవుడ్ - కోలీవుడ్ ప్రేక్షకులకు చూపించాలని ఫిక్స్ అయ్యింది.

రీసెంట్ గా ఒరిజినల్ కథను తెరకెక్కించిన దర్శకుడిని కలవడానికి బెంగుళూరు కూడా వెళ్లిందట. ఆమెతో పాటు నాగ చైతన్య కూడా వెళ్లాడు. అయితే సమంత మాత్రం ఇంకా అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు కాని.. ఈ ప్రాజెక్టును మాత్రం ఎలాగైనా తెలుగులో చేయాలని అమ్మడు ఆశపడుతోందట. అన్నీ కుదిరితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను తీస్తారట. అది సంగతి.