Begin typing your search above and press return to search.
ఇన్ స్టా డ్రాకులా ఒక్కో పోస్టింగుకి కళ్లు చెదిరే ఆదాయం?
By: Tupaki Desk | 12 Aug 2021 3:00 PM ISTసోషల్ మీడియాల్లో డిజిటల్ వేదికలపై స్టార్లు తమ ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందాల కథానాయికలు వేడెక్కించే ఫోటోషూట్లతో అనుచరుల్ని పెంచుకోవడంలో ఇతరులతో పోలిస్తే చాలా ముందున్నారు. అక్కినేని కోడలు సమంతకు ఇన్ స్టా సహా పలు మాధ్యమాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది.
18 మిలియన్ల మంది అనుచరులతో ఇన్ స్టాలో గొప్ప ఫాలోయింగ్ ని సామ్ కలిగి ఉంది. అంటే సుమారు 2కోట్ల మంది తనని అనుసరిస్తున్నారన్నమాట. ఈ ఆదరణకు తగ్గట్టే బ్రాండ్ లు ఇన్ స్టాగ్రామ్ ప్రమోషన్ కోసం తనకు 25లక్షల నుంచి 30లక్షల వరకూ ముట్టజెబుతున్నాయని తెలిసింది. తాను ఒక్కో పోస్టింగ్ కి అంత పెద్ద మొత్తాన్ని అందుకుంటోంది... దీనిని బట్టి నెలవారీ ఆదాయం ఇంకే రేంజులో ఉంటుందో ఊహించవచ్చు.
ఇన్నాళ్లు సినిమాలకు పారితోషికాలు.. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తేనే ఆదాయం వచ్చేది. రిబ్బన్ కటింగ్ ఈవెంట్ లు లేదా టీవీ షోలతో ఆర్జించేవారు.. ఇప్పుడు దీనికి అదనప ఆదాయ వనరుగా ఇన్ స్టా చేరింది. ఓటీటీల్లో నటించడం ద్వారా కూడా ఆదాయం మెరుగ్గా ఉంది. సమంత అక్కినేని నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్ లో నటించినందుకు సామ్ కి అమెజాన్ ప్రైమ్ భారీమొత్తాన్ని ముట్టజెప్పింది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో యాడ్ పోస్ట్ కు సుమారు 30 లక్షలు ఆర్జిస్తోందని సమాచారం. ఫాలోయింగ్ ని బట్టి ఇతర నటీమణులు రూ .5 నుండి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. సమంతతో పాటు వింక్ గాళ్ ప్రియా ప్రకాష్.. సన్నీలియోన్.. మలైకా అరోరా ఖాన్ లకు సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయివర్స్ ఉన్నారు. తెలుగు హీరోల్లో మహేష్- అల్లు అర్జున్ - ప్రభాస్- దేవరకొండ వంటి హీరోలకు గొప్ప ఫాలోయింగ్ ఉంది. వీరంతా ప్రకటనల పోస్టింగులతో ఆర్జిస్తున్నారు.