Begin typing your search above and press return to search.

ఏదొక మంచి జరుగుతూనే ఉంటుంది.. గుర్తుంచుకోండి: సమంత

By:  Tupaki Desk   |   12 Nov 2021 5:42 AM GMT
ఏదొక మంచి జరుగుతూనే ఉంటుంది.. గుర్తుంచుకోండి: సమంత
X
దక్షిణాదిన ప్రతిభ గల నటిగా, గ్లామరస్ క్వీన్ గా గుర్తింపు సంపాదించుకున్న సమంత రూత్ ప్రభు.. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. 'ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్‌ లో తన అద్భుతమైన నటనతో ఉత్తరాది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. అయితే ఉన్నట్టుండి తన భర్త అక్కినేని నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి మీడియాలో సోషల్ మీడియాలో సామ్ హాట్ టాపిక్ గా మారింది.

నాగచైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత.. వీలైనంత త్వరగా మానసికంగా దృఢంగా మారాలని నిశ్చయించుకుంది. ఇటీవల తీర్థయాత్రలు విహారయాత్రలకు వెళ్లి వచ్చిన సామ్.. ఇప్పుడు చెన్నైలోని తన ఇంటికి వెళ్ళింది. తన తల్లిదండ్రులతో కలిసి కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి నగరంలో ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి స్నేహితులు మరియు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతోందని అర్థం అవుతోంది.

సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన బాల్కనీ నుండి చెన్నై వర్షపు వాతావరణాన్ని తెలియజేసే ఓ ఫోటోని పోస్ట్ చేసింది. చెన్నైలో కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే సామ్ కేవలం ఒక్క రోజు తన పేరెంట్స్ తో గడపడానికి చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. తన పెట్ డాగ్స్ ని ఒక్కరోజు కోసం వదిలి వెళ్తున్నానని అగ్ర నటి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది.

ఇకపోతే చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి సమంత సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన సందేశాలను షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో స్ఫూర్తిదాయకమైన ఆలోచనను పంచుకుంది. ''ఎప్పుడూ ఏదో మంచి జరుగుతూనే ఉంటుంది.. గుర్తుంచుకోండి'' అని సామ్ షేర్ చేసిన కొటేషన్ ఆలోచిపజేస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. విడాకుల ప్రకటన తర్వాత సమంత ఇప్పటికే రెండు బైలింగ్వల్ ప్రాజెక్టులను ప్రకటించింది. అందులో ఒకటి రొమాంటిక్ ఫాంటసీ కాగా మరొకటి థ్రిల్లర్ అని తెలుస్తోంది. అలానే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పౌరాణిక సినిమాని పూర్తి చేసింది సామ్. ఈ పాన్ ఇండియా మూవీ విడుదల తేదీన ప్రకటించాల్సి ఉంది. విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి - నయనతార లతో కలిసి 'కాతువాకుల రెండు కాదల్' అనే తమిళ సినిమా చేస్తోంది. త్వరలోనే సమంత బాలీవుడ్ ఎంట్రీ కూడా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.