Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన సమంత ఇన్స్టా స్టోరీ..!

By:  Tupaki Desk   |   27 Aug 2021 6:02 AM GMT
హాట్ టాపిక్ గా మారిన సమంత ఇన్స్టా స్టోరీ..!
X
అగ్ర కథానాయిక సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపార కార్యకలాపాలతో బిజీగా గడుపుతోంది. అయితే హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని కోడలిగా మారిన సామ్.. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేరులో 'అక్కినేని' తొలగించి కేవలం 'ఎస్' అనే అక్షరాన్ని ఉంచడంసినీ అభిమానుల్లో చర్చకు దారితీసింది. ఈ క్రమంలో చైతన్య - సమంత వైవాహిక జీవితం పై పలు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన ప్రొఫైల్ నేమ్ మార్పు పై స్పందించారు.

అవన్నీ వదంతులే అని.. తన చుట్టూ ఉన్న కాంట్రవర్సీలపై ఎప్పుడుపడితే అప్పుడు స్పందించలేనని.. తనకు ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడతానని సామ్ సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకు వస్తున్న ఊహాగానాలపై సమంత క్లారిటీ ఇవ్వకపోగా.. ఇలా మాట్లాడటంతో అభిమానుల్లో మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో సామ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా అందరినీ ఆలోచింపజేసింది.

సమంత తన పెట్ డాగ్ యాష్ తో ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కొత్తేమీ లేదు కానీ.. దీనికి అక్కినేని కోడలు పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిలో పడింది. 'స్టే విత్ మి ఫరెవర్' అని సామ్ క్యాప్షన్ పెట్టడంతో ఈ సందేశం ఎవరి కోసమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సమంత 'అక్కినేని' ని తొలగించడానికి కారణమేంటో చెప్పేదాకా హాట్ టాపిక్ గానే ఉంటుందనేది అర్థం అయింది.

ఇకపోతే సమంత కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లుపైనే అవుతుంది. ఇప్పటి వరకు ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుటికైనా కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ సమయాన్ని పూర్తిగా వ్యక్తిగత జీవితానికి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే 'శాకుంతలం' తర్వాత కొత్త ప్రాజెక్ట్స్‌ కు సైన్ చేయలేదు'' అని చెప్పింది. సమంత ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. మరికొందరు మాత్రం త్వరలోనే చై-సామ్‌ ఏదైనా గుడ్‌ న్యూస్‌ చెప్పాలనుకుంటున్నారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.