Begin typing your search above and press return to search.

రాజీని మించి కష్టపడుతున్న శాకుంతలం

By:  Tupaki Desk   |   10 Aug 2021 5:00 PM IST
రాజీని మించి కష్టపడుతున్న శాకుంతలం
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌ గా మారిపోయింది. హిందీ వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమంత కీలక పాత్ర అయిన రాజీ గా కనిపించింది. సమంతలో మరో యాంగిల్ ను ఆ వెబ్‌ సిరీస్ లో చూశాం అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు కమర్షియల్‌ సినిమాలను చేసిన సమంత ఒకటి రెండు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కాని ఫ్యామిలీ మ్యాన్‌ లో మాత్రం రాజీ పాత్రకు ప్రాణం పోసింది. సాదారణ పాత్రలకు ప్రాణం పోయడం పెద్ద విషయం కాదు.. కాని రాజీ వంటి ఒక విభిన్నమైన నెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రకు ప్రాణం పోయడం అంటే మాత్రం మామూలు విషయం కాదు. సమంత మొదటి ప్రయత్నంతోనే నూటికి నూరు మార్కులు దక్కించుకునేలా మార్కులు దక్కించుకుంది.

నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత సినిమా కెరీర్‌ ముగుస్తుందని అంతా భావించారు. కాని నాగచైతన్య ప్రోత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ తో పాటు అన్ని వుడ్స్ లో కూడా పేరు దక్కించుకుంటున్న సమంత ప్రస్తుతం గుణ శేఖర్‌ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను చేస్తోంది. ఇప్పటి వరకు సమంత చేయని పాత్ర.. కనిపించని గెటప్‌ లో మొదటి సారి సమంత కనిపించబోతుంది. సమంత కు ది బెస్ట్‌ మూవీ గా ఈ సినిమా నిలుస్తుందని యూనిట్‌ సభ్యులు చెప్పడంతో పాటు సినిమాలో సమంత నటన ది బెస్ట్‌ గా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు సమంత చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా అత్యంత ప్రత్యేకంగా ఉండటం మాత్రమే కాకుండా ప్రతి సన్నివేశంలో కూడా సమంత కాకుండా శాకుంతల కనిపిస్తుందని అంటున్నారు.

సమంత ఈమద్య కాలంలో నటిగా ది బెస్ట్‌ అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించి ఫిజిక్ మొదలుకుని నటన వరకు ఎంతో కష్టపడుతోంది. శాకుంతలం పాత్ర కోసం సమంత పడుతున్న కష్టం గురించి ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఆ విషయాలు వైరల్‌ అవుతుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న శాకుంతంల సినిమాలో అల్లు అర్జున్‌ కూతురు అర్హ కూడా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అర్హ షూటింగ్‌ ముగించుకుందట. ఇటీవల అర్హ సెట్‌ లో ఉన్న సమయంలో అర్జున్ మరియు స్నేహాలు చూస్తూ మురిసి పోయిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.