Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ లో ఎరుపెక్కించిన సామ్!

By:  Tupaki Desk   |   7 Jun 2022 10:36 AM GMT
రెడ్ హాట్ లో ఎరుపెక్కించిన సామ్!
X
స‌మంత ఫ్యాష‌న్ ట్రెండ్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డిజైన‌ర్ దుస్తుల్లో అమ్మ‌డు ఫ్యాష‌న్ ప్రియుల్ని ఎప్ప‌టిక‌ప్ప‌డు క‌వ్విస్తూనే ఉంటుంది. ఆల్ర్టా మో డ్ర‌న్ గాళ్ గా..రేర్ గా టెంప్టింగ్ ఫోజుల‌తోనూ యువ‌త‌లో అగ్గిరాజేస్తుంటుంది. ఈ విష‌యంలో సామ్ త‌గ్గేదేలే. నాగ‌చైత‌న్య తో పెళ్లైన క్ర‌మంలోనూ ఇదే ర‌క‌మైన దూకుడు కొన‌సాగించింది.

ఇంకా చెప్పాలంటే ఆ వేగాన్ని పెంచిద‌న్న‌ది బ‌హిర్గ‌తం. ఇక చైతో రిలేష‌న్ బ్రేక‌ప్ త‌ర్వాత మ‌రింత స్వేచ్ఛగా విహ‌రిస్తుంది. రెక్క‌లొచ్చిన ప‌క్షిలా గాల్లోకి అలా ఎగిరిపోతుంది. 'ఊ అంటావా మావ ..ఊఊ అంటావా మావ' పాట‌లో ఏ రేంజ్ లో అందాలు ఆర‌బోసిందో తెలిసిందే. తాజాగా స‌మంత మ‌రోసారి రెడ్ హాట్ లో సెగ‌లు రేపుతుంది.

పింక్ క‌ల‌ర్ టైట్ ఫిట్ ప్యాంట్ కి మ్యాచింగ్ గా రెండ్ క‌ల‌ర్ స్కిన్ టైట్ లో క్లీవేజ్ అందాల ఎలివేష‌న్ల‌తో ఆక‌ట్టుకుంటుంది. ఫేస్ లో అమ్మ‌డి గ్లోనెస్ మ‌రింత వ‌న్నె తీసుకొచ్చింది. ఆ మ‌ధ్య డ‌ల్ గా ఫోక‌స్ అయిన సామ్ ఇప్పుడు ఎంతో ప్రెష్ గా..ఆహ్లాద‌క‌రంగా క‌నిపిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల్లో క్యామ్ కి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. సామ్ అభిమానులు ఆస‌క్తిక‌ర కామెంట్ల‌తో మ‌రింత ఎరుపెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం స‌మంత బాలీవుడ్ కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన నేప‌థ్యంలో ఫిట్ నెస్ పై మ‌రింత ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. ఆ మ‌ధ్య వ్య‌క్తిగ‌త కార‌ణాలుగా మాన‌సిక ఇబ్బందుల‌కు గురైంది. ఈ క్ర‌మంలో ఫేస్ లో ఎన్నో మార్పులొచ్చాయి. ఇప్పుడా మాన‌సిక ఇబ్బందులు అన్నింటిని అధిగ‌మించి పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

గ‌తాన్ని విస్మ‌రించి వ‌ర్త‌మానంలో జీవిస్తుంది. యోగా.. జిమ్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెట్టి సామ్ లో గ్లామ‌ర్ ఏ మాత్రం త‌రిగి పోలేద‌ని నిరూపించింది. హిందీ సినిమాలే ల‌క్ష్యంగా కెరీర్ ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. ఇప్ప‌టికే ఓప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లో ఛాన్స్ అందుకుంద‌ని గుస గుస వినిపిస్తుంది. అలాగే రాజ్ అండ్ డీకే నిర్మాణంలో రూపొందుతున్న మ‌రో వెబ్ సిరీస్ లోనూ న‌టిస్తుంది.

ఇక తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ లేడీ ఓరియేంటెడ్ ప్రాజెక్ట్ లు క‌మిట్ అవుతుంది. ఇప్ప‌టికే 'శాకుంత‌లం'..'య‌శోద' సినిమాల షూటింగ్ పూర్తి చేసింది. కొత్తగా ఓ యువ నిర్మాత స‌మంత లీడ్ రోల్ కోసం సంప్ర‌దించిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. స‌మంత తో ఎప్ప‌టి నుంచో సినిమా చేయాల‌ని ఆ యువ నిర్మాత ప్లాన్ చేస్తున్నాడా? ఇప్పటికీ స‌మంత‌ని క‌లిసి అవ‌కాశం దొరికింద‌ని గుస గుస వినిపిస్తుంది. అదే నిజ‌మైతే ఆ యువ నిర్మాత అభిమానం అంతా స‌మంత సినిమాలో చూపించ‌నున్నారు.