Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ : ఎంత సక్కగున్నావే!!

By:  Tupaki Desk   |   10 April 2018 10:06 AM IST
ఫొటో స్టోరీ : ఎంత సక్కగున్నావే!!
X

రామలక్ష్మిని మొట్టమొదటి సారి చూసినప్పుడే చిట్టి బాబు చిట్టి గుండె గుల్లయిపోయింది. అందుకే ఎంత సక్కగున్నావే లచ్చిమీ... అంటూ పాడకుండా ఉండలేకపోయాడు. రామలక్ష్మి రంగస్థలం సినిమాలో పాత్రే అయినా జనాలకు మాత్రం బాగా కనెక్టయిపోయింది. సమంత కెరీర్ లో తొలిసారి చేసిన పల్లె పడుచు పాత్రలో అంతగా అదరగొట్టేసింది.

రంగస్థలం సూపర్ హిట్ అవడంతో సినిమా టీం మొత్తం ప్రమోషన్లతో హోరెత్తిస్తోంది. కానీ సమంత మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఇన్నాళ్లకు మళ్లీ టీవీలకు ఇంటర్వ్యూలివ్వడం మొదలెట్టింది. ఈ ఇంటర్వ్యూలు చూసినవాళ్లంతా కూడా ఎంత సక్కగున్నావే పాట గుర్తు తెచ్చుకుని మరీ పాడుతున్నారు. కాకుంటే అమాయకమైన రామలక్ష్మి పాత్రను గుర్తుకు తెచ్చుకుని కాదు.. అల్ట్రా మోడ్రన్ గెటప్ లో సమంత గ్లామర్ ను చూసి ఈ పాటందుకుంటున్నారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూకు శామ్ వచ్చిన తీరు చూస్తే అబ్బా ఎంత గ్లామరో అనిపించక మానదు. స్లీవ్ లెస్ గౌనులో క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ వాలుగా ఆనుకుని కూర్చున్న శామ్ ను చూస్తే రెప్ప వేయడం మర్చిపోవాల్సిందే. గుండె కొట్టుకోవడం ఆగిపోవాల్సిందే.

అక్కినేని హీరో నాగచైతన్యతో పెళ్లి తరవాత సమంత ఖాతాలో రంగస్థలం మూవీలో తొలి బ్లాక్ బస్టర్ మూవీ చేరింది. దీని తరవాత అలనాటి నటి సావిత్రి జీవితగాథతో వస్తున్న మహానటి సినిమాలో సమంత వెండితెరపై కనిపించనుంది. ఇందులో మధురవాణి అనే జర్నలిస్టు పాత్ర చేస్తోంది. మధురవాణిగా సమంత లుక్ ఇప్పటికే మెప్పించింది. ఇటు సినిమాల్లో నటనతోనూ.. ఇటు ప్రమోషన్లలో గ్లామర్ ను కుమ్మరించేస్తూ శామ్ రెండు రకాలుగా దూసుకుపోతోంది.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి