Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరి ప్రేమ పెళ్లికి సమంత అడ్డం పడుతుందా?

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:30 PM GMT
ఆ ఇద్దరి ప్రేమ పెళ్లికి సమంత అడ్డం పడుతుందా?
X
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత ఈమద్య కాలంలో రెగ్యులర్ కమర్షియల్‌ పాత్రల్లో కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ ఉంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్ లో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన సమంత ముందు ముందు మరిన్ని విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళంలో విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో ఈమె నటించిన కాత్తువాక్కుల రెండు కాదల్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో నయనతార మరియు విజయ్‌ సేతుపతి కూడా కనిపించబోతున్నారు. వీరిద్దరి ప్రేమకు పెళ్లికి సమంత అడ్డు వస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. సినిమా లో సమంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

విజయ్ సేతుపతి ప్రేమను దక్కించుకునేందుకు లేదా నయనతార తో విభేదాల కారణంగా ప్రేమ కు అడ్డు పడే పాత్రలో సమంత కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సమంత మరియు నయనతార లు ఈ సినిమా కోసం పోటీ పడి మరీ నటించారనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కూడా సినిమా లో విజయ్‌ సేతుపతి చుట్టు తిరుగుతూ ఉంటారని.. ఇది ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ అన్నట్లుగా ఉంటుందని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సమంత నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది అంటూ వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగేలా చేశాయి. ఈ సినిమా కు నయన్‌ ప్రియుడు.. కాబోయే భర్త అయిన విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడం వల్ల తమిళ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు లో కూడా ఈ సినిమాను చూడాలని నయన్ మరియు సమంత అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

కాత్తువాక్కుల రెండు కాదల్‌ చిత్రంలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్న సమంత హాలీవుడ్‌ మూవీ అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ లో బై-సెక్సువల్‌ యువతి పాత్రలో కనిపించబోతుంది. ఇలా ఛాలెంజింగ్ రోల్స్ ను చేస్తూ సమంత తన కెరీర్‌ లో మరింత బిజీ అవుతుంది. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు చేయడం వల్ల తనలోని నటిని ఆమె సంతృప్తి పర్చుతుంది. ఇప్పటి వరకు కమర్షియల్‌ పాత్రలు చాలానే చేసింది. కనుక ఇక మీదట ఇలాంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తే ఆమె కెరీర్ కు ఒక అర్థం ఉంటుంది. కనుక ఆమె ఇలా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా నటించేందుకు ఓకే చెప్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.