Begin typing your search above and press return to search.
ప్రేతాత్మగా సామ్ దడ పుట్టిస్తుందట
By: Tupaki Desk | 4 Sept 2022 4:00 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు బాలీవుడ్ లో అమాంతం డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. అక్కడ వరుసగా వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. యువహీరో వరుణ్ ధావన్ తో తన వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఇది రస్సో బ్రదర్స్ `సిటాడెల్`కి భారతీయ వెర్షన్. ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ లో సమంత శిక్షణ పొందుతోంది. అయితే అదే సమయంలో తన తొలి హిందీ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించిందని గుసగుస వినిపిస్తోంది.
`స్త్రీ` ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న హారర్ చిత్రం కోసం ట్యాలెంటెడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి వర్క్ షాప్ లలో పాల్గొంటోంది. రాజస్థాన్ నేపథ్యంలో మరో జానపద కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని సామ్ ఈ మూవీలో రాజ్ పుత్ యువరాణిగా అలాగే ప్రేతాత్మ (దెయ్యం)గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఆయుష్మాన్ ఆమె ప్రేమికుడిగా కనిపిస్తారని సమాచారం. సమంత ఓంకార్ హార్రర్ చిత్రం రాజు గారి గది 2 లో నటించింది. కానీ అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఇప్పుడు మళ్లీ హారర్ జానర్ ని టచ్ చేస్తోంది. బాలీవుడ్ లో థ్రిల్లర్ కం హారర్ మూవీ భూల్ భులయా 2 విజయం తర్వాత సామ్ లో ఆశలు చిగురించాయని భావించాలి.
2022 సమంతదే సుమీ
ఇండస్ట్రీలో అత్యుత్తమ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ల జాబితాను రూపొందించగా సమంత పేరు లిస్ట్ లో టాప్ 1 స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే ఓర్మాక్స్ ప్రకటించిన 2022 జూలై జాబితాలో సమంత రూత్ ప్రభు నంబర్ -1 స్థానంలో నిలిచింది. ఇప్పటికీ సామ్ నే టాప్ వన్ స్టార్ గా ఓర్మాక్స్ పట్టంగట్టింది. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో ఎల్.టి.టి.ఇ తీవ్రవాది రాజీ పాత్రలో సమంత అద్భుతంగా నటించింది.
ఆ తర్వాత పుష్ప చిత్రంలో ఊ అంటావా ఐటమ్ నంబర్ తో ఉత్తరాది యూత్ ని ఒక ఊపు ఊపింది. సామ్ ఇప్పటికిప్పుడు బాలీవుడ్ లో నాలుగైదు చిత్రాలకు సంతకాలు చేసి దూకుడుగా దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో సామ్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు. క్రేజ్ అలానే కొనసాగుతోంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో క్రిప్టిక్ టాకింగ్ స్టైల్ తో కుర్రకారు గుండెల్ని టీజ్ చేసిన సామ్ కి క్రేజ్ అసాధారణంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఆసక్తికరంగా సమంత ఇప్పుడు పాన్ ఇండియా కథానాయికగా పాపులారిటీతో దూసుకుపోతోంది. ఒక్కో సినిమాకి 5 కోట్ల మేర పారితోషికం అందుకునే అర్హతను కూడా సమంత సంపాదించింది. ఇది సౌతిండియన్ స్టార్ హీరోయిన్లలో ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి. అయితే సమంతకు ఓర్మాక్స్ నంబర్ -1 అంటూ పట్టంగట్టినా తన సహచర నటి నయనతారనే ఇండియా నంబర్ -1 స్టార్ అంటూ కీర్తించి మరోసారి మనసులు గెలుచుకుంది.
కథానాయికలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను రకరకాల కోణాల్లో విశ్లేషిస్తారు. నాయికల బ్రాండ్స్ విలువ.. సినిమాల లైనప్.. గూగుల్ సెర్చ్ ..సోషల్ మీడియా ఫాలోయింగ్.. పబ్లిక్ లో బజ్ వగైరా వగైరా అంశాలను పరిగణించి ఓర్మాక్స్ ఇండియా అనే సంస్థ ఈ సర్వేని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.