Begin typing your search above and press return to search.

ఫ్రీ మోడ్ లో సామ్.. దేనికైనా రెడీ..!

By:  Tupaki Desk   |   21 May 2022 12:30 AM GMT
ఫ్రీ మోడ్ లో సామ్.. దేనికైనా రెడీ..!
X
సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ హీరోయిన్ కైనా పెళ్ళైన తర్వాత లేదా విడాకుల అనంతరం అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. కానీ సామ్ విషయంలో అలా జరగలేదు.

అక్కినేని నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు.. అలానే అతనితో విడిపోయిన తరువాత కూడా సమంతకు ఎప్పటిలాగే వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఒక రకంగా అప్పటి కంటే ఇప్పుడు క్రేజ్ ఇంకాస్త పెరిగిందని చెప్పాలి.

డివోర్స్ ప్రకటన తర్వాత సామ్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టింది. ఒకవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి.. గ్లామర్ ట్రీట్ అందించడానికి కూడా వెనకాడటం లేదు.

'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ లో క్లీవేజ్ షో తో ఊపేసిన సమంత.. ఇటీవల కాలంలో పలు మ్యాగజైన్స్ కోసం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోయింది. అందుకే పెళ్లి తర్వాత కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. విడాకుల తర్వాత మళ్ళీ హద్దులు చేరిపేసిందని అందరూ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో సామ్ లిప్ లాక్ సీన్స్ చేయడానికి కూడా రెడీ అయిందనే ఓ న్యూస్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ''ఖుషి'' సినిమాలో అలాంటి సన్నివేశాల్లో కనిపించబోతోందని టాక్ నడుస్తోంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''ఖుషి''. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో అందమైన ప్రదేశాల్లో జరుగుతోంది.

అయితే ఈ సినిమాలో విజయ్ - సమంతల మధ్య రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని టాక్. అంతేకాదు వీరి మధ్య లిప్ లాక్ సీన్స్ మరియు ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఇటీవల కాలంలో సినిమాల్లో చుంబన దృశ్యాలు అనేవి కామన్.

విజయ్ దేవరకొండ గత చిత్రాల్లో ఇలాంటివి చాలానే చూశాం. అందులోనూ 'ఖుషీ' ఓ రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా అని తెలుస్తోంది. ఇలాంటి సినిమాల్లో కిస్సింగ్ సీన్స్ కి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కథ డిమాండ్ చేయడంతో సామ్ లిప్ లాక్ కు ఓకే చెప్పినట్లు టాక్.

ఇకపోతే 'ఖుషి' సినిమా ఒక రేసర్ కథతో తెరకెక్కుతోందని రూమర్స్ వస్తున్నాయి. ఇందులో విజయ్ కంటే ఏజ్ లో సమంత పెద్దదిగా ఉంటుందని.. అతనికి సూపర్ సీనియర్ అని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే డిసెంబర్ 23 వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా అదే రోజు నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల కాబోతోంది.