Begin typing your search above and press return to search.

డెబ్యూ సిరీస్ తో మెప్పించిన సామ్.. వివాదాలు ఆమెను అడ్డుకోలేకపోయాయి..!

By:  Tupaki Desk   |   4 Jun 2021 4:30 PM GMT
డెబ్యూ సిరీస్ తో మెప్పించిన సామ్.. వివాదాలు ఆమెను అడ్డుకోలేకపోయాయి..!
X
అక్కినేని సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ''ది ఫ్యామిలీ మ్యాన్ 2'' నిన్న (జూన్ 3) రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో యావత్ సినీ అభిమానులు సీజన్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అదే సమయంలో ఈ సిరీస్ పై వివాదాలు కూడా వచ్చాయి. తమిళుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని.. దీన్ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళ నటి అయిన సమంత ను ఎక్కువగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఓటీటీ వేదికగా విడుదలైన 'ఫ్యామిలీ మ్యాన్ 2' విశేష ఆదరణ దక్కించుకుంటోంది.

'ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ సీజన్ కు ఏ మాత్రం తగ్గకుండా, దానికి మించి రెండో సీజన్ ని రూపొందించారు దర్శకద్వయం రాజ్ & డీకే. ప్రతి ఎపిసోడ్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా సాగింది. ఈ వెబ్ సిరీస్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీనికి అద్భుత‌మైన ఓపెనింగ్ రెస్పాన్స్ వ‌చ్చిందని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్ లో సమంత బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కథలో ఎంటర్ అయిన తర్వాత సామ్ ఈ సిరీస్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

లైంగిక వివక్షకు గురయ్యే రాజీ పాత్రలో పూర్తిగా డీ గ్లామ్ లుక్ లో కనిపించి అద్భుతమైన నటన కనబరిచింది. అంతేకాదు యాక్షన్ సీన్స్ లో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. సామ్ తన ఫెర్ఫార్మెన్స్ తో ఎమోషన్స్ పండించిన విధానం.. డైలాగ్స్ చెప్పిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇది ఆమె కెరీర్ లోనే బెస్ట్ ఫర్ఫార్మెన్స్ గా ఆడియన్స్ తీర్పు ఇస్తున్నారు. ఓటీటీ డెబ్యూ కోసం ఛాలెంజింగ్ రోల్ ఎంచుకున్న సమంత.. బ్లాస్టింగ్ ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు. దీంతో ఆమెకు పాన్ ఇండియా పాపులరిటీ వచ్చినట్లే. ఏదేమైనా ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా సామ్ 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ ని ఏమీ చేయలేకపోయాయనేది స్పష్టంగా తెలుస్తుంది.