Begin typing your search above and press return to search.
ఇప్పుడేంటి.. సమంత హర్ట్ అయ్యిందా?
By: Tupaki Desk | 8 July 2017 11:00 PM ISTబాలీవుడ్ హీరోయిన్లు లాగా మన హీరోయిన్స్ లో పెద్దగా బేధాభిప్రాయాలు ఉండవు అంటుంటారు. అందరం ఒకే గూటి పక్షులు అనే భావనతో పని చేస్తూపోతుంటారు మన భామలు.కాని ఈ మధ్య ఇద్దరి తెలుగు టాప్ హీరోయిన్లు మధ్య ఏదో సెగ నడుస్తుంది అని తెలుస్తుంది. వీళ్ళు ఇంతకు ముందుకూడా కలిసి ఒకే సినిమాలో నటించారు కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య అసలు పడటంలేదని టాక్.
‘చందమామ’ హీరోయిన్ కాజల్ - ‘ఏమాయ చేసావే’ ఫేమ్ సమంత కలిసి 'బృందావనం' ‘బ్రహ్మోత్సవం’ లో నటించారు. మహేష్ సినిమా ప్రమోషన్ టైమ్ లో అక్కడ కాజల్ ఉంది అనే ఉద్దేశ్యంతో సమంత కొంచం లేట్ గా వచ్చేదట. అంతకు ముందు ‘రామయ్యా వస్తావయ్యా’లో కూడా శృతి హాసన్ తో సమంతకు పడేది కాదని టాక్. తనను ఆ హీరోయిన్లు అందరూ ఎప్పుడో ఎక్కడో తక్కువగా చూశారనేది సమంత ఫీలింగట. ఇక 'జనతా గ్యారేజ్’ సినిమా ప్రమోషన్లో కాజల్ గురించి సమంతను అడిగితే “సినిమాలో ఐటెం సాంగ్ చేసిన వాళ్ళ గురించి నేనేం చెప్తాను?” అనేసింది. అదంతా చూస్తే సమంతకు కాజల్ కు మధ్య వైరం పెరుగుతూ వచ్చినట్లు ఉంది. ఇప్పుడు నాగార్జున కొత్త సినిమా రాజు గారి గది 2 లో కాజల్ క్యామియో చేస్తోందనే న్యూస్ రాగానే సమంత హర్టయ్యిందట. ఈ సినిమాలో కాబోయే మామయ్య నాగార్జున కోరిక మేరకు చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకున్న సమంత.. కాజల్ ను కూడా ఒక రోల్ కు తీసుకున్నందుకు కొంచెం కోపంగా ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి. చూస్తుంటే రాజు గారి గది ప్రమోషన్లకు రాదేమో అనిపిస్తోంది అంటున్నారు సన్నిహితులు.
అసలు ఈ స్టార్ హీరోయిన్ల మధ్యన గొడవలు ఎందుకు వచ్చాయో తెలియదు కాని.. సమంత మాత్రం దాదాపు స్టార్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ తో తప్పించి ఎవరితోనూ అంతగా ఇంటరాక్ట్ అవ్వదనే టాక్ కూడా ఉంది. మరి సమంత రీజనింగ్ సమంతకు ఉండుంటుందిలే.