Begin typing your search above and press return to search.

మొన్న బాలీవుడ్ .. నేడు హాలీవుడ్.. సామ్ దూకుడు!

By:  Tupaki Desk   |   14 Nov 2021 3:30 PM GMT
మొన్న బాలీవుడ్ .. నేడు హాలీవుడ్.. సామ్ దూకుడు!
X
వ‌రుస విహార‌యాత్ర‌ల‌ను ముగించుకుని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌తో బిజీ అవుతోంది స‌మంత‌. హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్.. ప‌రిశ్ర‌మ ఏదైనా త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రాల్లేవ్. వ‌రుస క‌మిట్ మెంట్ల‌తో ఫుల్ బిజీ అయిపోతున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితంలో డిస్ట్రబెన్సెస్ నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం ఇదంతా.

ఇంత‌కుముందే స‌మంత ఓ బాలీవుడ్ చిత్రానికి సంత‌కం చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. దాంతో పాటే శ్రీ‌దేవి మూవీస్ లో తెలుగు సినిమా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ తో త‌మిళ సినిమాకి సంత‌కం చేసింది. ఇంత‌లోనే పుష్ప చిత్రంలో స్పెష‌ల్ నంబ‌ర్ లో న‌ర్తించేందుకు ఆల్మోస్ట్ అంగీక‌రించింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇక‌పోతే ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాలో న‌టించేందుకు స‌మంత సంత‌కం చేశార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఓబేబి నిర్మాత సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఇప్ప‌టికే ఈ జోడీ శాకిని డాకినీ అనే మ‌రో సినిమాకి క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఇంత‌లోనే వీరి నుంచి హాలీవుడ్ మూవీ కి స‌న్నాహ‌కాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శక‌త్వం వ‌హించ‌నుండ‌గా.. తిమెరి ఎన్ మురారి నవల అయిన ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ స్ఫూర్తితో తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. భార‌తదేశంతో పాటు వేల్స్ లో మెజారిటీ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తారు. సునీత తాటి ఇత‌ర భాగ‌స్వాముల‌తో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారా.. లేక సోలోగానే నిర్మిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మొన్న బాలీవుడ్ .. నేడు హాలీవుడ్.. సామ్ దూకుడు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హాలీవుడ్ ఎక్క‌డైనా సై అనేస్తున్న సామ్ ప్ర‌తిభ‌కు ఆకాశ‌మే హ‌ద్దు. వ‌రుస‌ అవ‌కాశాల్ని ఒడిసిప‌ట్టుకుని దూసుకుపోతున్న సామ్ కెరీర్ మ‌రింత ఉన్న‌త స్థాయికి ఎదిగేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.