Begin typing your search above and press return to search.

అఖిల్‌ 4 లో సమంత?

By:  Tupaki Desk   |   17 Dec 2019 3:30 PM GMT
అఖిల్‌ 4 లో సమంత?
X
అఖిల్‌ 4వ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే అఖిల్‌ చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడలేదు. కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అఖిల్‌ కు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపైనే చాలా నమ్మకం ఉంది. బొమ్మరిల్లు వంటి క్లాసిక్‌ మూవీని అందించిన భాస్కర్‌ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి కనిపించకుండా పోయాడు. మళ్లీ ఇప్పుడు అఖిల్‌ 4 కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలాంటి సినిమాలో ఏదైనా మ్యాజిక్‌ ఉంటేనే ప్రేక్షకులు ఈ చిత్రం వైపు ఆకర్షితం అవుతారు.

ఆ మ్యాజిక్‌ గా ఇందులో సమంతను ఉపయోగించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్దార్థ తన కథను ఒక లేడీకి చెబుతూ ఉంటాడు. అలాగే ఈ చిత్రంలో కూడా అఖిల్‌ తన కథను చెప్పడం సమంతకు చెప్పడం లేదంటే సమంతతో ఈ చిత్రం కథను చెప్పించడం వంటిది ఏదో చేయబోతున్నారట. సమంత స్క్రీన్‌ స్పేస్‌ కొద్ది నిమిషాలే అయినా కూడా ఆమె అప్పియరెన్స్‌ తో సినిమాకు ప్లస్‌ అవుతుందని అంతా భావిస్తున్నారు.

అఖిల్‌ మరియు వదిన అయిన సమంత గతంలో 'మనం' సినిమాలో నటించారు. ఇద్దరి మద్య ఆ సినిమాలో సీన్స్‌ ఏమీ లేవు. మళ్లీ ఇప్పుడు అఖిల్‌ 4 లో సమంత గెస్ట్‌ అప్పియరెన్స్‌ గా కనిపించబోతుంది అంటున్నారు. అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. అతి త్వరలోనే షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టేసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అది కుదరకుంటే వేసవి ఆరంభంలో సినిమా వచ్చే అవకాశం ఉంది.