Begin typing your search above and press return to search.

స‌రిహ‌ద్దుల్లేవిక‌! బిగ్ ట్రీట్ కి కంక‌ణం క‌ట్టుకున్న సామ్!!

By:  Tupaki Desk   |   16 Nov 2021 7:55 AM GMT
స‌రిహ‌ద్దుల్లేవిక‌! బిగ్ ట్రీట్ కి కంక‌ణం క‌ట్టుకున్న సామ్!!
X
నిన్న నేటికి వార‌ధి.. నేడు రేప‌టికి పునాది. మొత్తానికి స‌మంత కెరీర్ ప్లానింగ్ చూస్తుంటే నెవ్వ‌ర్ బిఫోర్ అని ప్ర‌శంసించాల్సిందే. ఇన్నాళ్లు టాలీవుడ్ కోలీవుడ్ వ‌ర‌కే ప‌రిమిత‌మైన స‌మంత ప్లానింగ్స్ ఇక‌పై బాలీవుడ్ హాలీవుడ్ అంటూ ఛాలెంజింగ్ ట‌ర్న్ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌తిభ‌ను చాటుకునేందుకు స‌రిహ‌ద్దులు లేవ‌ని నిరూపించేందుకు స‌మంత కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. అభిమానులకు ఇక‌పై వ‌రుస‌గా స్పెష‌ల్ ట్రీట్ ముందుంది. అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేష‌న్ మూవీ పుష్ప లో స‌మంత ప్రత్యేక పాటపై అధికారిక ప్రకటన చేయగా.. త‌దుప‌రి తమిళ మల్టీ-స్టారర్ కాతు వాకులా రెండు కాదల్ నుండి సామ్ ఫస్ట్ లుక్ కూడా నిన్న విడుదలై వైర‌ల్ అయ్యింది.

త‌దుప‌రి బిగ్ అప్ డేట్ గురించి సామ్ వెయిటింగ్. త్వ‌ర‌లోనే బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల గురించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయ‌ని స‌మాచారం. అయితే బాలీవుడ్ అరంగేట్రానికి ముందు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు అదిరిపోయే ప్లానింగ్ తో సామ్ ఉంద‌ని తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ జర్నలిస్ట్ అనుపమ చోప్రాతో ఇటీవ‌లి ఇంటర్వ్యూలో సామ్ అనూహ్యంగా కోస్టార్ తాప్సీతో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాల‌పై క్లారిటీనిచ్చింది. అనుపమ్‌ లాంటి పేరున్న జర్నలిస్టు ఇంటర్వ్యూ తో సామ్ బి-టౌన్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సామ్ నటన హిందీ ఆడియెన్ ని విప‌రీతంగా ఆక‌ర్షించింది. ఓబేబి అనువాదంతోనూ త‌న ప్ర‌తిభ లోకానికి తెలిసొస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాకి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. అయితే అధికారికంగా త‌న ఎంట్రీ గురించిన సంగ‌తిని స‌మంత టీమ్ ప్ర‌తిదీ స‌వివ‌రంగా వెల్ల‌డించాల్సి ఉంది.