Begin typing your search above and press return to search.

శ్రీవల్లికి రామలక్ష్మి సర్‌ ప్రైజింగ్‌ గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   1 Oct 2021 10:30 AM GMT
శ్రీవల్లికి రామలక్ష్మి సర్‌ ప్రైజింగ్‌ గిఫ్ట్‌
X
రంగస్థలం సినిమాలో సమంతను రామలక్ష్మిగా చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన దర్శకుడు సుకుమార్‌ ఇప్పుడు పుష్ప సినిమాలో రష్మిక మందన్నాను శ్రీవల్లిగా చూపించబోతున్నాడు. ఇప్పటికే శ్రీవల్లి ఫస్ట్‌ లుక్ వచ్చింది. రంగస్థలం రామలక్ష్మికి ఏమాత్రం తగ్గకుండా పుష్ప శ్రీవల్లి ఉందనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఇద్దరు కూడా మాస్ రఫ్‌ లుక్ లో ఎవరికి వారు అన్నట్లుగా అదిరి పోయారు అంటూ టాక్ వినిపిస్తుంది. ఇటీవల విడుదల అయిన శ్రీవల్లి లుక్ ను ఎక్కువ శాతం మంది సమంత రంగస్థలం రామలక్ష్మి లుక్ తో కంపైర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. ఇద్దరు కూడా పలు సందర్బాల్లో మాట్లాడుకోవడం.. ఒకరి గురించి ఒకరు అభినందించుకోవడం చేశారు. వీరిద్దరు తాజాగా సోషల్‌ మీడియా ద్వారా తమ ఆనందంను పంచుకున్నారు.

సమంత ప్రారంభించిన సాకీ వరల్డ్ వార్షికోత్సవం సందర్బంగా పీవీ సింధు.. సుష్మిత కొణిదెల ఇంకా పలువురు ప్రముఖులకు గిఫ్ట్‌ యాంపర్స్ ను పంపించడం జరిగింది. అదే సమయంలో రష్మిక మందన్నా కూడా సమంత తన సాకీ వరల్డ్ నుండి సర్‌ ప్రైజింగ్‌ గిఫ్ట్ ను పంపించింది. సమంత పంపించిన ప్యాక్ కు రష్మిక ఫిదా అయ్యింది. తనకు దక్కిన సర్‌ ప్రైజ్ కు ముగ్దురాలు అయినట్లుగా పేర్కొంది. సమంత కు మరియు ఆమె టీమ్‌ కు రష్మిక అభినందనలు తెలియజేస్తూ తనకు వచ్చిన సాకీ వరల్డ్ గిఫ్ట్ ను షేర్‌ చేసింది. రష్మిక మందన్న తో పాటు సమంత నుండి సర్‌ ప్రైజింగ్‌ ప్యాక్‌ లు అందుకున్న అంతా కూడా సాకీ వరల్డ్‌ టీమ్‌ కు మరియు సమంతకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత అభివృద్దిని కాంక్షిస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో సాకీ వరల్డ్ ను ప్రమోట్‌ చేయడంలో తమ వంతు భాగస్వామ్యం అయ్యారు.

సమంత ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అవుతున్నా కూడా ఇంకా వరుస ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది. ఈమద్య కాలంలో కాస్త ఆఫర్ల హడావుడిని ఈ అమ్మడు తగ్గించింది. తెలుగు లో సమంత నటించిన శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. తమిళంలో విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను సమంత చేస్తోంది. ఆ సినిమా లో నయనతార కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది. మరో వైపు రష్మిక మందన్నా విషయానికి వస్తే టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేయడంతో పాటు తమిళం మరియు హిందీల్లో సినిమాలను దక్కించుకుంటుంది. తన హోం అయిన కన్నడ ఇండస్ట్రీలో కూడా కంటిన్యూగా ఏడాదికి కనీసం ఒక్కటి రెండు అయినా సినిమాలను చేస్తూ వస్తోంది. మొత్తానికి ఇద్దరు బిజీ స్టార్స్ ఇలా సోషల్‌ మీడియాలో సర్‌ ప్రైజ్ లు షేర్ చేసుకోవడం అభినందనీయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.