Begin typing your search above and press return to search.

సామ్ వెంట 70ల‌క్ష‌ల మంది

By:  Tupaki Desk   |   6 Sep 2018 4:42 AM GMT
సామ్ వెంట 70ల‌క్ష‌ల మంది
X
ద‌శాబ్ధ కాలంగా సినీ వినీలాకాశంలో త‌న‌వైన వెలుగులు ప్ర‌స‌రిస్తోంది స‌మంత‌. ఇన్నేళ్ల కెరీర్‌ లో జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఎదురేలేని నాయిక‌గా అవ‌కాశాలు అందుకుంది. ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో - ఫ్యాన్స్‌ లో అపార‌మైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడి అక్కినేని కోడ‌లుగా అభిమానుల మ‌న‌సుల్లో గొప్ప గౌర‌వం ఆపాదించుకుంది. చైత‌న్య‌- స‌మంత ల‌వ్‌ స్టోరి గురించి తెలిసిందే. `ఏమాయ చేశావే` సినిమాతో స‌మంత క‌థానాయిక‌గా టాలీవుడ్‌ కి ప‌రిచ‌య‌మైంది. తొలి చూపు ఆక‌ర్ష‌ణ‌తో చైతూ స్పెల్ బౌండ్ అయిపోయాడు. అటుపై ప్రేమ మాయ‌లో నిండా మునిగాడు.

అయితే చైతూ ప్రేమ‌తో సంబంధం లేకుండా స‌మాంత‌రంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువై ఉంది సామ్‌. ఇంకా జెస్సీగా బోయ్స్ గుండెల్లో నిదురిస్తూనే ఉంది. అందుకే సామాజిక మాధ్య‌మాల్లో త‌న‌ని అనుస‌రించే వారి సంఖ్య అపారం. ఇప్ప‌టికి 70ల‌క్ష‌ల మంది (7మిలియ‌న్స్) త‌న‌ని ట్విట్ట‌ర్‌ లో అనుస‌రిస్తున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది.

సౌత్‌లో 70 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్న భామ‌ల జాబితాలో ప్ర‌థ‌మంగా శ్రుతిహాస‌న్ ఓ వెలుగు వెలుగుతోంది. స్టార్ హీరో ధ‌నుష్‌ కి ట్విట్ట‌ర్‌ లో అంత‌మంది పాలోవ‌ర్స్ ఉన్నారు. ఇప్పుడు 7 మిలియ‌న్స్ క్ల‌బ్‌ లో స‌మంత చేరిపోయింది. ట్విట్ట‌ర్‌ లో రెగ్యుల‌ర్‌ గా అభిమానుల‌కు ట‌చ్‌ లో ఉండే తార‌గా ఈ ఫీట్‌ ని సాధించ‌గ‌లిగింది. స‌మంత తాను న‌టించిన సినిమాల ప్ర‌మోష‌న్స్ - ఫోటోషూట్స్ ని సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌రం పోస్ట్ చేస్తూ మెయింటెయిన్ చేయ‌డం వ‌ల్ల‌నే ఇదంతా సాధ్య‌మైంది. సామ్ న‌టించిన యూట‌ర్న్‌ - సీమ రాజా ఈనెల 13న సైమ‌ల్టేనియ‌స్‌ గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వీటి ప్ర‌మోష‌న్స్‌ ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అద‌ర‌గొట్టేస్తోంది సామ్‌. రంగ‌స్థ‌లం - అభిమాన్యుడు - మ‌హాన‌టి చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ భామ‌ ఈసారి డ‌బుల్ హ్యాట్రిక్‌ పైనా క‌న్నేసింది. ఆ ఫీట్ సాధ్య‌మ‌వుతుందేమో చూడాలి.