Begin typing your search above and press return to search.

టెర్రాస్ పంట‌లు అంద‌రికీ సాధ్య‌మా కోడ‌లా?

By:  Tupaki Desk   |   29 July 2020 11:15 AM IST
టెర్రాస్ పంట‌లు అంద‌రికీ సాధ్య‌మా కోడ‌లా?
X
అక్కినేని కోడ‌లు స‌మంత ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. ఇక కోడ‌లు గారు గ‌త కొంత‌కాలంగా ఇన్ స్టా మాధ్య‌మంలో విస్త్ర‌త‌ నాలెజ్ కి సంబంధించిన విష‌యాల్ని షేర్ చేస్తున్నారు. ఇంత‌కుముందు హైద‌రాబాద్ గ‌చ్చ‌బౌలిలోని గేటెడ్ క‌మ్యూనిటీ త‌న 12వ అంత‌స్తు అపార్ట్ మెంట్ లో వంట చేస్తున్న ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేశారు. చైత‌న్య‌తో ఇక్క‌డే త‌న నివాసం కాబ‌ట్టి క్వారంటైన్ ప్రైవ‌సీ అదిరింది. సామ్ షేర్ చేసిన ప్ర‌తి ఫోటోని వీడియోని అభిమానులు వైర‌ల్ గా ప్ర‌మోట్ చేశారు.

తాజాగా టెర్రాస్ పొలం పేరుతో ఆకుకూర‌ల్ని కూర‌గాయ‌ల్ని పండిస్తున్నారు సామ్. మేడ‌పై పొలం అన్న‌దే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.. అయితే ఇక్క‌డ ఇంత‌కీ ఏవి పండిస్తున్నారు? అంటే.. పాల‌కూర- బ‌చ్చ‌లికూర వెరీ స్పెష‌‌ల్. బెల్ పెప్పర్.. చెర్రీ టమోటాలు పండిస్తున్నారు. అలాగే ఆవపిండి ఆకుకూరలు పేరుతో ప‌చ్చ‌ని ఆకుకూర‌ల్ని షేర్ చేసుకున్నారు. వీటితో పాటు తుల‌సి వ‌నం పెంచుతున్నారు. ఓవ‌రాల్ గా సామ్ టెర్రాస్ వ్య‌వ‌సాయం బిగ్ స‌క్సెస్ అయ్యింద‌నే భావిస్తున్నారు.

అయితే ఈ త‌ర‌హా వ్య‌వ‌సాయం అంత సులువేమీ కాదు. కాస్త ఖ‌రీదైన‌ది. స‌పోర్టింగ్ టేబుల్స్ స‌హా టెక్నిక‌ల్ స‌పోర్ట్ తోనే ఇదంతా సాధ్యం. మ‌ట్టి తెచ్చి టెర్రాస్ పై వేసి అందులో విత్త‌నాలు చ‌ల్లి.. నీరు పోసి పండిచేయాలి అనుకుంటే కుదిరే ప‌ని కాదు. వెడ‌ల్పాటి కుండీల్ని త‌ల‌పించే ఒక్కో టేబుల్ కోసం వేల‌ల్లో ఖ‌ర్చు చేయాలి. టేబుల్ కి 15వేలు చొప్పున ఖ‌ర్చ‌యినా 10 టేబుళ్ల‌ను పోషించాలంటేనే రూ.1.50 ల‌క్ష‌లు పైగా పెట్టాలి. ఇదేమీ ఆషామాషీ ఖ‌ర్చు కాదు. పండించే పంట‌తో ఆదాయం నిల్. కేవ‌లం ప్యాష‌న్ కోసం మాత్ర‌మే ఈ వ్య‌వ‌సాయం అని విశ్లేషిస్తున్నారు.

అయితే కోవిడ్ 19 ప్ర‌మాదంలో ఇలాంటి పంట‌లు పండించి తింటే ఆరోగ్యానికి ఏ డోఖా ఉండ‌దు. క‌నీసం రైతులు త‌మ ఇంటి ముందు ఆవ‌ర‌ణ‌లో ఇలాంటి పంట‌లు పండించుకుని తింటేనే సేఫ్ అన్న విశ్లేష‌ణ సాగుతోంది. స‌మంత లాంటి సెల‌బ్రిటీలు ఇలాంటివాటికి ప్ర‌మోష‌న్ చేయ‌డం బావున్నా కానీ ఇవి అంద‌రికీ ఆచ‌ర‌ణీయం కాద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.